Dulquer Lucky Bhaskar 6 Days Collection: దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ దీపాలి విన్నర్ గా చెప్పవచ్చు. దుల్కర్ రీసెంట్గా నటించిన మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీతో దూల్కర్ సల్మాన్ తెలుగులో యాత్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడని చెప్పవచ్చు. దుల్కర్ సల్మాన్ మలయాళం హీరో అయినప్పటికీ తెలుగులో కూడా భారీ అభిమానులను సొంతం చేసుకోవడం జరిగింది.
Dulquer Salmaan గారు తెలుగులో స్ట్రైట్ నటించిన మొదటి రెండు చిత్రాలు వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చినవే. కల్కి దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రంలో దుల్కర్ సల్మాన్ ఎంజిఆర్ పాత్రను పోషించి తెలుగు తమిళ్ మంచి పేరును తెచ్చుకోవడం జరిగింది. అలాగే తన రెండవ తెలుగు ఫిలిం అయినటువంటి సీతారామము కూడా వైజయంతి మూవీస్ నిర్మించడం జరిగింది. ఈ మూవీ కూడా విడుదలైన అన్ని భాషలలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. సీతారామ మూవీ నుండి దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పవచ్చు. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఉన్న హీరోలకు పోటీ అని కూడా చెప్పవచ్చు. దుల్కర్ సల్మాన్ సీతారామ0 మూవీతో దుల్కర్ సల్మాన్ అందరూ తెలుగు హీరో గానే చూస్తున్నారని చెప్పవచ్చు.
అలాగే Dulquer Salmaan గారి తెలుగు మూడవ స్ట్రైట్ చిత్రం లక్కీ భాస్కర్. ఈ మూవీ దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలోనూ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కావడం జరిగింది. ఈ సినిమా మీద మొదటి నుంచి తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా ఈ సినిమాను తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ గారు నిర్మించడం జరిగింది.
Lucky Bhaskar సినిమా దీపావళి కి విడుదలై మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు అన్ని భాషలలో కలుపుకొని 12 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత రెండవ రోజు వసూళ్లు పెరిగి 25 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మొత్తంగా Lucky Bhaskar మూవీ 6 రోజులకు గాను సుమారు 67.6 కోట్ల రూపాయలను రాబట్టడం జరిగింది. అలాగే ఈ సినిమా వాసులను చూసుకుంటే ప్రతిరోజు యావరేజ్ గా 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలో ఇప్పటికే హౌస్ ఫుల్ కలెక్షన్ తో దూసుకుపోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తొందరలోనే 100 కోట్ల మార్కును కూడా అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేయడం జరిగింది.
దీనితో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన స్ట్రైట్ మూడు చిత్రాలు భారీ విజయాలను సాధించి తెలుగులో వరుసగా మూడు విజయాలు సాధించిన హీరో లా సరసన చేరాడు అని చెప్పవచ్చు. అలాగే లక్కీ భాస్కర్ మూవీల దుల్కర్ సల్మాన్ గారి నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి ఇందులో నటించిన ప్రతి ఒక్కరు బాగా నటించారని చెప్పవచ్చు. ఇందులో ఉన్న ప్రతి పాత్ర ఇంపార్టెన్స్ ని కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాని దర్శకుడు వెంకీ అట్లూరి ఎక్కడ బోర్ కొట్టకుండా తన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం దీపావళి సందర్భంగా వచ్చిన మూడు చిత్రాలలో దీపావళి విన్నారు గా లక్కీ భాస్కర్ చిత్రం అని చెప్పడం జరుగుతుంది.