ఇంకో తెలుగు సినిమాను స్టార్ట్ చేసిన Dulquer Salmaan

Written by 24newsway.com

Published on:

Dulquer Salmaan : తన తొలి తెలుగు సినిమాని ఈరోజు పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేయడం జరిగింది. దుల్కర్ సల్మాన్ మలయాళం లో టాప్ హీరో గా కొనసాగుతున్న అలాగే టాలీవుడ్ లో కూడా తన మార్కెట్ను పెంచుకుంటున్నాడు. పోయిన సంవత్సరం దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి సోదరి ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రం చేయడం జరిగింది ఆ చిత్రం పేరు లక్కీ భాస్కర్. అలాగే తాను నటించిన తెలుగు చిత్రం లక్కీ భాస్కర్ విడుదల కోసం దుల్కర్ సల్మాన్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. లక్కీ భాస్కర్ పూర్తయిన వెంటనే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తన కొత్త తెలుగు చిత్రం ను అధికారికంగా ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది.

ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా ఈరోజు రామానాయుడు స్టూడెంట్ లో చాలా గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది. . ఈ ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా విచ్చేశాడు అలాగే టాలీవుడ్ ప్రముఖులందరూ ఈ పూజా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వీటితోపాటు Dulquer Salmaan హీరోగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గత సంవత్సరమే ప్రకటించడం జరిగింది.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా రీసెంట్ గా వచ్చిన రవితేజ గారి మూవీ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్గా నటించిన భాగ్యశ్రీ ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కథానాయకగా నటిస్తుంది ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం. అలాగే దూల్కర్ సల్మాన్ మార్కెట్ కూడా ఈ రెండు మూడు సంవత్సరాల్లో చాలా పెరిగింది. దుల్కర్ సల్మాన్ మలయాళం లోనే కాకుండా తెలుగు తమిళ్ హిందీ చిత్రాలలో నటిస్తూ తన మార్కెట్ ని రోజురోజుకీ పెంచుకోవడం జరిగింది..

దుల్కర్ సల్మాన్ అంతకుముందు రెండు తెలుగు చిత్రాల్లో నటించడం జరిగింది అది కూడా రెండు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు ఒకరైన అశ్విని దత్ బ్యానర్లో నటించాడు. దుల్కర్ సల్మాన్ మొదటి తెలుగు చిత్రం గా మహానటి మూవీ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ గారి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అదే బ్యానర్ లో అశ్విని కూతురు అయిన స్వప్న దత్ నిర్మించిన సీతారామన్ సినిమాతో మల్లొకసారి తెలుగులో భారీ ఇంటిని దుల్కర్ సల్మాన్ కొట్టారు. ఆ తర్వాత తెలుగులో కూడా దుల్కర్ సల్మాన్ కి మంచి మార్కెట్ ఏర్పడిందని కూడా చెప్పవచ్చు.

రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో కూడా దుల్కర్ సల్మాన్ గారు ఒక చిన్న పాత్రను చేయడం జరిగింది.. ఆ మూవీ నుండి నిర్మించింది కూడా అశ్విని దత్తు గారి బ్యానర్. ఒక విధంగా చెప్పాలంటే వైజయంతి మూవీస్ దుల్కర్ సల్మాన్ గారి తెలుగు ఓన్ బ్యానర్ గా చెప్పవచ్చు.

దుల్కర్ సల్మాన్ గారు నటిస్తున్న ఈ కొత్త మూవీని స్పిరిట్ మీడియా, స్వప్న సినిమా, మరియు వెపేరర్ ఫిలిమ్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి మరియు స్వప్న దత్ మరియు దుల్కర్ సల్మాన్ ముగ్గురు కలిసి నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని వాళ్లు చెప్పడం జరిగింది.

Read More

Leave a Comment