Nerve Strengthపెరగాలంటే ఈ ఫుడ్స్ తినండి. ఈ కాలంలో చాలా ఆరోగ్య సమస్యలు అది కూడా చిన్న వయసులోనే రావడం జరుగుతుంది.. అందులో నరాల బలహీనత కూడా ఇప్పుడున్న వారికి పెద్ద సమస్యగా చెప్పవచ్చు. మానవ శరీరంలో నరాలు చాలా కీలక పాత్ర వహిస్తాయని మన అందరికీ తెలిసిన విషయమే. బ్రెయిన్ నుంచి శరీరంలోని అన్ని భాగాలకు సంకేతాలను పంపించడానికి నరాలు చాలా కీలకంగా ఉంటాయి. వీటివల్ల నాడీ వ్యవస్థ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన ఆక్సిజన్ మరియు పోషకాలు తీసుకువెళ్లడంలో Nerve Strength ముఖ్యమైన పాత్ర వహిస్తాయని మనందరికీ తెలిసిన విషయమే.
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి మరియు వాతావరణ కాలుష్యం దానితోపాటు అనారోగ్యకరమైన ఆహార పలవాట్లతో లేనిపోని సమస్యలు ఇప్పుడున్న ప్రజలు తెచ్చుకోవడం జరుగుతుంది శరీరానికి కావలసిన పోషకాలు సరైన సమయానికి అందకపోతే రకరకాల వ్యాధులు వస్తాయి అందులో నరాల బలహీనత కూడా ఉంది .
దీర్ఘకాలిక తలనొప్పి జ్ఞాపక శక్తి తగ్గడం చేతులు, కాళ్లు తిమ్మిరెక్కడం కండరాల బలం కోల్పోవడం వంటి లక్షణాలు ఎంత మాత్రము మంచిది కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. నరాల బలహీనత ఉంటే ఈ లక్షణాలు మీలో కనిపిస్తాయి చెడు అలవాట్లకు మరియు ఒత్తిడి కారణంగా నరాల్లో రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి దీంతో ఈ సమస్య తలెత్తకుండా మనము నివారణ పద్ధతుల ద్వారా నివారించవచ్చు .ఈ సమస్య ఎదుర్కొనేవారు చాలా బాధ నొప్పి భరిస్తూ ఉంటారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కొన్ని సూపర్ ఫుడ్స్ మన డైలీ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది.
NerveStrength foods:
1. ఆకుకూరలు: ఆకుకూరలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయని మనకు తెలుసు ఆకుకూరలలో పాలకూర తోటకూర బచ్చలకూర మెంతికూర కొత్తిమీర పుదీనా వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి .వీటిలో చాలా రకాల పోషకాలు మెండుగా ఉంటాయి వీటిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ మరియు క్యాల్షియం మరియు ప్రోటీన్ ఐరన్ పొటాషియం వంటివి ఈ ఆకుకూరల్లో చాలా బాగా ఉంటాయి ఇవి ఇమ్యూనిటీ పవర్ పెంచడమే కాకుండా మెదడు యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడం జరుగుతుంది. అంతేకాకుండా రోజు తినే ఆహారంలో ఇవి రోజు తింటే Nerve Strength యొక్క బలహీనత తగ్గుతుందని నిపుణులు ఒక అధ్యయనంలో తెలియజేయడం జరిగింది.
2.సిట్రస్ ఫ్రూట్స్: సిట్రస్ యాసిడ్ ఈ ఫ్రూట్ లలో ఎక్కువగా ఉంటుంది .నిమ్మకాయ మరియు నారింజ బత్తాయి వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవిగా చెప్పవచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ లో ఎన్నో పోషకాలు మరియు విటమిన్లు ఖనిజాలు చాలా బాగా లభిస్తాయి. వీటిలో విటమిన్ సి ఫైబర్ ఎక్కువగా ఉంటాయి వీటిని తినడం వలన మరియు యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు నరాలు దెబ్బతినకుండా కాపాడడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని చాలా అధ్యయనాలు తెలపడం జరిగింది.