Eat these fruits to keep your heart healthy:
మన heart healthy ఉండాలంటే ఈ పండ్లను తింటే సరిపోతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు ఎంతగానో సహాయపడతాయి. మన ఆరోగ్యం తగినట్లుగానే సీజన్ కి రకరకాల పండ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ పనిని మనము సీజన్ ప్రకారం తీసుకున్న గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మన ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. సీజన్ తగ్గట్టు మన ఆహారంలో పండ్లను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అటువంటి పండు ఏమిటో ఇప్పుడు వరసగా తెలుసుకుందాం.
. మామిడి పండ్లు :
మామిడి పండ్లు అనేవి సీజనల్ గా వచ్చే పండ్లు అని చెప్పవచ్చు. ఈ మామిడి పండ్ల లో అధిక పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లలో ఇది మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఏ విధమైన అనుమానం లేదు. ఈ మామిడి పండ్లు మార్చి నుంచి జూన్ వారికి అందుబాటులో ఉంటాయి. మామిడి పండ్లలో విటమిన్ A విటమిన్ C అధికంగా ఉంటుంది. దీని ద్వారా అధిక కొలెస్ట్రాలను తగ్గించి రక్త ప్రసరణను వేగవంతం చేయడంలో ఈవెంతగానో తోడ్పడతాయి. రక్త ప్రసరణ వేగంగా జరగడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. మామిడి పండ్ల లో గుండెను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
దానిమ్మ పండు:
శీతాకాలంలో వచ్చే దానిమ్మ పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడం జరుగుతుంది. అలాగే దానిమ్మ పండ్లు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు లభిస్తాయి. ఇవి పాలిపీనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. దానిమ్మ పండును రెడ్డర్ గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాలను కూడా మనం కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.
జామ పండు :
జామ పండు మనసు సంవత్సరం మొత్తము దొరుకుతుంది. ముఖ్యంగా జామపండు చలికాలంలో ఎక్కువగా కాస్తాయి. జామకాయలో ఎక్కువగా ఫైబర్ మరియు విటమిన్ C అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మరియు కొలెస్ట్రాల సాయిలను కూడా తగ్గించి గుండెకు రక్తప్రసరణ వేగంగా జరగానికి జామకాయ ఎంతగానో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అరటి పండ్లు:
అరటి పండ్లు సంవత్సరం మొత్తం మనకు దొరుకుతూనే ఉంటాయి. అరటి పండ్లు పోచకలకు గాని అని కూడా చెప్పవచ్చు. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే అరటి పండ్లలో B6 అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె యొక్క పనితీరును కూడా ఇది మెరుగు పరుస్తుంది.
ఇలా మనకు రోజు దొరికే సీజనల్ పండ్లు ద్వారా మన ఆరోగ్యాన్ని మన గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పండ్లను రోజువారి మీ ఆహారపు అలవాట్లల్లో చేర్చుకోవడం చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.