Health Tips : అధిక ప్రోటీన్ కావాలా ఈ నట్స్ తినండి. నట్స్ అనేవి పోషకల గని అని అంటారు. వీటిల్లో ఆరోగ్యకరమైన విటమిన్ లు మరియు మినరల్స్ మరియు ప్రోటీన్ అనేవి చాలా బాగా ఉంటాయి ఈ ప్రోటీన్లు శరీరాన్ని శరీరం యొక్క బలాన్ని పెంచడంతోపాటు శరీరంలోని కండరాల అభివృద్ధికి మరియు శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రాసెస్ లా కు ఇది చాలా అవసరం ముఖ్యంగా శాఖాహారులకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. నట్స్ అనేవి ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో చాలా బాగా సహాయ పడతాయి ఇక్కడ అధిక ప్రోటీన్ కలిగిన కొన్ని ప్రధానమైన నట్స్ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం:
బాదం పుష్కలంగా ప్రోటీన్ కలిగిన నట్స్ లలో మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు 100 గ్రాముల బాదంలో సుమారు 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇవి ఎముకల ఆరోగ్యం కోసం అవసరమైన విటమిన్ E మరియు మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉంటాయి బాదం కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు మంచి ఫైబర్ కలిగి ఉంటుంది బాదం తీసుకోవడం వల్ల మన శరీరంలో జీర్ణశక్తి చాలా మెరుగుపరచడంలో బాదం అనేది చాలా బాగా సహాయపడుతుంది అలాగే మన శరీరం యొక్క బరువు నియంత్రనాల్లో కూడా బాదం ఆనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వాటితో పాటు మన శరీరంలో గుండె ఆరోగ్యం మెరుగుపరచాలన్న బాదం ను ప్రతిరోజు తీసుకుంటే మనకు చాలా మంచిది అలాగే బాదం వల్ల ఇంకో ముఖ్యమైన ప్రయోజనం మన శరీరానికి కలుగుతుంది అది చర్మ సౌందర్యం. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా బాదం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
పిస్తా:
పిస్తా లో ప్రోటీన్ ను చాలా కలిగి ఉంటుందని ఎన్నో అధ్యయనాలు తెలపడం జరిగింది 100 గ్రాముల పిస్తా లలో సుమారు 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అలాగే పిస్తాలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు మన శరీరానికి కావలసిన మంచి కొవ్వులతో కూడా సమృద్ధిగా ఉంటుంది మన గుండెకు చాలా మేలు చేస్తాయి అలాగే గుండెకు మేలు చేసే మోనో స్టాచ్యూరేటెడ్ ఫ్యాట్స్ మరియు విటమిన్లు మరియు మినరల్స్ పిస్తాలో చాలా పుష్కలంగా ఉంటాయి వీటిని తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే మన శరీరంలో ఉండే కండరాలకు బలాన్ని పెంపొందించాలంటే మనము రోజు పిస్తా పప్పును తినడం చాలా మంచిది.
వాల్ నట్స్:
వాల్ నట్స్ ఒక రకం మైన నట్స్ ఇవి ప్రధానంగా ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు మరియు మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు కూడా అధికంగా ఉన్న నట్స్ దీనిలో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి 100 g వాల్నట్స్ లో సుమారు 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వాల్ నట్స్ లో ఉండే ఓ మెగా 3 మరియు పేటి ఆసిడ్లు మన మెదడు ఆరోగ్యాన్ని మరియు గుండె ఆరోగ్యం కోసం ఇది చాలా ఉపయోగపడతాయి అలాగే వాల్నట్స్ ఎక్కువగా తినడం వలన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే శరీరంలో కణాల వృద్ధిని ప్రోత్సహిస్తాయి.
వేరు శనగలు:
వేరుశనగలు సాధారణంగా నట్స్ గా పరిగణిస్తారు 100 గ్రాముల వేరుశనగలు తింటే సుమారు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది అత్యధికంగా ప్రోటీన్ కలిగిన నట్స్ అని కూడా చెప్పవచ్చు దీనిలో అధికంగా ఫైబర్ మరియు హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి కావలసిన శక్తిని అందించడం జరుగుతుంది వీటిని ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెప్పడం జరుగుతుంది వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు అని మరియు కండరాల వృద్ధికి వేరుశనగలు చాలా బాగా దోహదపడతాయి అని వైద్య నిపుణులు చెప్పడం జరుగుతుంది.