ఈ ఆహారాలు తినడం వల్ల మీ జుట్టు( Hair Fall ) ఊడిపోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తినాలి. మనమే కాదు మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా గాని మనం మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా విపరీతంగా ఒత్తిడిలో ఉన్నవారు సరైన పోషకాహారం తీసుకొని వారు జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది.
ఈ ఆహారాల వల్ల Hair Fall జరుగుతుంది:
చాలామంది ఎక్కువగా జుట్టు రాలిపోతుందని రకరకాల నూనెలు తెచ్చి జుట్టు కు రాస్తారు. Hair Fall ఉండేందుకు చాలా మంది చాలా తిప్పలు పడతారు. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే జుట్టు ఊడిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడు మనం పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరం .అదేవిధంగా పౌష్టికాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకోకుండా ఉండడం కూడా అంతే అవసరమా అని వైద్యులు చెప్పడం జరుగుతుంది.
మనం తెలియక తినే ఈ ఆహారాలు మీ జుట్టుని ఊడిపోయే లా చేస్తాయని వైద్యులు చెబుతున్నారు వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువగా తినే ఆహారాలు అయినటువంటి కేకులు ,పిజ్జాలు లలో ఉండే కార్బోహైడ్రేట్స్ తో జుట్టు వేగంగా రాలిపోతుందని వైద్యులు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు బాదంపప్పు వంటి డ్రైఫ్రూట్స్ ని ఎక్కువగా తింటే కూడా వాటిలో ఉండే సెలీనియం కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అంటున్నారు.
కాబట్టి డ్రైఫ్రూట్స్ను కూడా తగ్గిన మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు మరి సూచిస్తున్నారు చాలామంది లిక్కర్ తాగుతూ ఉంటారు లిక్కర్ అతిగా సేవించడం వలన కూడా జుట్టు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని వైద్యులు చెప్పడం జరుగుతుంది. మందు ఎక్కువగా తాగడం వల్ల లివర్ తో పాటు జుట్టు కూడా దెబ్బతింటుందని వైద్యులు తెలియజేయడం జరిగింది.
చాలామంది డోనాట్ వంటి వాటిని విపరీతంగా తీసుకుంటూ ఉంటారు. వీటిలో ఉండే షుగర్ కారణంగా బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది న్యూట్రియన్స్ జుట్టు వరకు వెళ్ళవు ఫలితం జుట్టు రాలిపోతుంది. ఇక శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం కొంతమందిలో ప్రోటీన్ డైట్ ను తీసుకుంటూ ఉంటారు ఇలాంటి వారిలో కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలామంది కూల్ డ్రింక్ ఎక్కువగా తాగుతూ ఉంటారు కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు ఇతర కార్బో హైడ్రేట్ డ్రింక్ ను కూడా తాగుతూ ఉంటారు ఇలా తాగడం కూడా జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు అందుకే మనం తీసుకునే ఆహారంలో వీటిని తీసుకోకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని వైద్యశాస్త్రం చెప్పడం జరిగింది మరియు వైద్యులు కూడా చెప్పడం జరిగింది.
వీటికి దూరంగా ఉంటూ నాచురల్ గా దొరికే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన జుట్టు మాత్రమే కాదు శరీరం కూడా చాలా బాగా ఉంటుంది. ఎక్కువ శాతం నాచురల్ ఫుడ్ తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. జంక్ ఫుడ్ ను ఇప్పటికైనా వదిలేయండి.