shankar డైరెక్టర్ శంకర్ కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది! ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ కు ED భారీ షాక్ ఇచ్చింది. మనీ ల్యాండింగ్ కేసులో శంకర్ కు చెందిన దాదాపు పది కోట్ల విలువైన మూడు స్థిరాసులను ఈడి జప్తు చేసింది.
కేసుకు సంబంధించిన వివరాల్లో కి వెళ్తే తన కథ జిగుబా ను కాపీ కొట్టి శంకర్ రోబో సినిమా రూపొందించాలని అరూరు తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు శంకర్ కాపీరైట్ ఐటిపి చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా శంకర్ కు వ్యతిరేకంగా రావడం గమన హారం జగుబా కథ కు రోబో సినిమాకు మధ్య చాలా పోలిక లు ఉన్నాయని పేర్కొంది శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 ని ఊల్లంగించినట్లు ఆ వివరాల ఆధారంగా ఈడి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ఈడి వెల్లడించింది.
కాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన రోబో సినిమా 2010 లో విడుదలై భారీ విజయం సాధించిన విషయం తెలిసింది ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 కోట్లు వసూలు చేసి రాబట్టింది. ఈ చిత్రానికి shankar శంకర్ పారితోషికంగా 15 కోట్లు అందించినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇది ఇలా ఉండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా shankar డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాలతో విడుదల అయింది. ఎవరు ఊహించని విధంగా గేమ్ చేంజెస్ మూవీ మిక్స్ డు టాక్ సొంతం చేసుకుంది. అయినా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఓపెనింగ్ రాబట్టి ంది కానీ ఆ తర్వాత అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది క్రమంగా వసూలు తగ్గుతున్నాయి.గేమ్ చేంజర్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు.