Star Hero కి కోట్లు రాసిచ్చిన Star Heroine ఎవరబ్బా : తెలుగులో మనకు ఉన్న స్టార్ హీరోలలో దివంగత శోభన్ బాబు గారు ఒకరు. ఆయన Star Hero గానే కాకుండా ఒక ఆర్థిక నిపుణులుగా బిజినెస్ మాన్ గా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. సంపాదించే ప్రతి రూపాయి భూమి మీద పెడితే బాగుపడతారని ఇప్పుడున్న చాలామంది హీరోలకు వీర్మాతలకు తనతో పాటు నటించే ఆర్టిస్టులకు కు ఒకప్పుడు తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పటి కీ సినిమా ఇండస్ట్రీ లో మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లో చాలామంది కూడా శోభన్ బాబు గారు చెప్పిన దానిని ఫాలో కూడా అవుతున్నారు. దటీజ్ మన సోగ్గాడు శోభన్ బాబు గారు.
శోభన్ బాబు గారు తాను సినిమాలలోకి వచ్చిన తర్వాత సంపాదించిన ప్రతి రూపాయి భూమ్మీద పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది.. ఎందుకని భూమి మీద పెట్టమంటున్నారో చాలామంది నిర్మాతలు అందరూ శోభన్ బాబు గారిని చాలా అడిగేవారు. అప్పుడు శోభన్ బాబు గారు తనతో పాటు నటించిన హీరోలకు నిర్మాతలకు ఒకే విషయం చెప్పేవాడు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఒక రూపాయి రాను వచ్చు పోను వచ్చు కానీ భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి పోవడం అంటూ జరగదు అది ఎందుకంటే భూమి మీద మూడు వంతులు నీళ్లు ఒక వంతు మాత్రమే భూమి ఉన్నది. అలాగే రోజు రోజుకి జనవరి శాతం పెరుగుతూ వస్తుంది. జనాభా పెరుగుతుంది కానీ భూమి మాత్రం పెరగదు కాబట్టి ఇప్పుడు మనం పెట్టిన ప్రతి రూపాయి తర్వాతే కాలంలో వంద రూపాయలకి కోట్లు పోవచ్చు. అనే సూత్రాన్ని తన తోటి హీరో హీరోయిన్లకి మరియు తనతో సినిమాలు తీసిన నిర్మాతలకు తన స్నేహితులకు అందరికీ ఈ మాటే చెప్పి ప్రోత్సహించేవాడు.
మన శోభన్ బాబు గారు ఫ్యూచర్ ని అంచనా వేయడంలో దిట్ట. అందుచేత తన సంపాదించిన ప్రతి రూపాయి చెన్నై చుట్టుపక్కల ఉన్న భూముల మీద పెట్టుబడి పెట్టడం జరిగింది. అప్పుడు లక్ష రూపాయలు పెట్టి కొన్న భూమి ఇప్పుడు సుమారు 50 కోట్ల పై మాటే. అంతెందుకు మనం రియల్ ఎస్టేట్ కింగ్ అని చెప్పుకునే మురళి మోహన్ గారు ఎప్పుడు ఇంటర్వ్యూలో శోభన్ బాబు గారు ఇచ్చిన ఐడియా వాళ్ళనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్పుకోవడం మనం చాలా సార్లు చూసాము.
శోభన్ బాబు గారు తనకు చెప్పిన విషయం చాలా గొప్పదని అందువలనే నేను శోభన్ బాబు గారు లాగానే భూమి మీద పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఇంత భారీగా సంపాదించానని కొన్ని ఇంటర్వ్యూలో మురళి మోహన్ గారు చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది హీరోయిన్లు కూడా చెప్పడం జరిగింది.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది Star Heroine జయసుధ గారు. జయసుధ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో శోభన్ బాబు గారి గురించి ఇలా మాట్లాడారు. శోభన్ బాబు గారు నన్ను చెన్నైలోని అన్నా నగర్ లో ప్లేసును కొనమన్నారని అయితే అప్పుడు అన్నా నగర్ ఒక చెత్త వేసే స్థలం అని నేను కొనలేదని కానీ తనకు తర్వాత తప్పు చేశానని తనకు అర్థమైందని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు చెన్నై లోని అన్నా నగర్ లో ఒక్క ఎకరం విలువ సుమారు 100 కోట్ల రూపాయలు ఉన్నది అని బాబు గారు చెప్పినప్పుడు నేను అక్కడ భూమిని కొంటె ఇప్పుడు నా చేతిలో సుమారు కొన్ని వేల కోట్లు ఉండేవని జయసుధ గారు జయసుధ గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది ఇలాగే చాలామంది శోభన్ బాబు గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాము.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే శోభన్ బాబు గారికి జయలలిత గారు కొన్ని వేల కోట్లు ఇచ్చారని ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కూర్చుంది. అసలు మేటర్ ఏంటంటే జయలలిత గారు శోభన్ బాబు గారికి మధ్య రిలేషన్ ఉందని ఎప్పటినుంచో ఉన్న వార్త ఇప్పుడు మనం వింటూనే ఉన్నాము. అయితే జయలలిత గారు తాను సంపాదించిన మరియు ఎంజీఆర్ గారి స్పీచ్ బ్యాంకులో ఉన్న కొన్ని వేల కోట్ల రూపాయలను శోభన్ బాబు గారికి ఇచ్చారని. ఒక న్యూస్ ఇప్పుడు చెక్కర్లు కొడుతుంది అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలవదు.