Hari Hara Veera Mallu Release Date Announced: Pawan ఫ్యాన్సీ పండగ లాంటి వార్త హర హర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి మొదటి పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుంది. హర హర వీర మల్లు సినిమాకి ప్రస్తుత డైరెక్టర్ జ్యోతి కృష్ణ కానీ హర హర వీరమల్లు సినిమాను మొదటగా స్టార్ట్ చేసినప్పుడు క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వలన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పకుండా జరిగింది.
Hari Hara Veera Mallu Release సినిమా రెండు పార్టులుగా వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం నడుస్తుంది. ఈ సినిమా మొదటి భాగం హర హర వీరమల్లు “స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ” గా రూపొందడం జరుగుతుంది. ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటుంది. అయితే ఇవాళ హర హర వీరమల్లు సినిమా గురించి ఒక వార్త వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు డేట్ తో ఒక పోస్టర్ను మూవీ టీం విడుదల చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త ఆని చెప్పవచ్చు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా కోసం Pawan కళ్యాణ్ ఫ్యాన్స్ గత రెండు మూడు సంవత్సరాలుగా ఎదురు చూడడం జరుగుతుంది. అందులో పవన్ కళ్యాణ్ గారు మొదట సారిగా పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ ఎప్పటినుంచి ఎదురు చూడడం జరుగుతుంది.
గత కొంతకాలంగా హర హర వీరమల్లు సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఉండటం వలన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తో చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అయితే ఇవాళ Hari Hara Veera Mallu Release Date ప్రకటించినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ లో ఆనందం తో సోషల్ మీడియా ఈ వార్త అందరికీ షేర్ చేస్తూ ట్రెండింగ్ చేయడం జరిగింది. అయితే హర హర వీరమల్లు సినిమా పవన్ కెరియర్ లోనే ఒక ముఖ్యమైన సినిమాగా చెప్పవచ్చు.
ఎందుచేతనంటే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా పిరియాడిక్ డ్రామా సినిమాలో నటించడం జరుగుతుంది. ఈ సినిమాను నిర్మాత ఏయం రత్నం గారు చాలా బడ్జెట్ తో నిర్మించడం జరుగుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ అదే కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా సినిమాగా హరి హర వీరమల్లు సినిమా రూపొందించబడింది.మొదటగా హరిహర వీరమల్లు సినిమా krish దర్శకత్వంలో మొదలైనది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల krishఈ సినిమా నుంచి తప్పకుండా జరిగింది. అందుకే ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా మీద ఇంకో రికార్డు ఉంది వరుసగా 14 సార్లు వాయిదా పడిన సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు లేదు ఇది రికార్డు అని చెప్పవచ్చు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే హర హర వీర మల్లు సినిమా ఈరోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాను జూలై 24వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఈరోజు ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. చూడాలి ఈసారి అయినా కరెక్ట్ గా ఈ సినిమా విడుదల అవుతుందో లేదో