Five benefits of eating bananas

Written by 24 News Way

Published on:

Five benefits of eating bananas : అరటిపండు తినడం వల్ల కలిగే ఐదు లాభాలు.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశంలో ఎక్కువగా ఇష్టపడే పండ్లలో అరటిపండు ఒకటి వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. అరటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు గుండెను పదిలంగా ఉంది పొటాషియం బాగా లభిస్తుంది. తీయదనంతో పసుపు రంగులో ఉండే అరటి పండ్లు మనకు ఎక్కువ లభిస్తాయి ఆకుపచ్చటి పనులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఆకుపచ్చ అరటి పనులను కూరగాయ రూపంలో ఎక్కువగా వినియోగిస్తారు.

అరటి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

పేగు పదిలం. అరటి పనుల్లో ఎక్కువగా ఉండే పెక్టీవ్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. పేగులోని ఆహారము త్వరగా జీర్ణం అయ్యేందుకు సహకరిస్తుంది. అందులో ఉండే కరిగిపోయే గుణం ఉన్న ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అరటి పండ్లలో అధిక ఫైబర్ కారణంగా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.

గుండెకు భరోసా. అరటి పండ్లు పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుంది శరీరంలోని అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లలో పొటాషియం ఒకటి ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో సమతుల్యాన్ని కాపాడడంతోపాటు రక్తపోటు నియంత్రిస్తుంది పొటాషియం రక్తపోటును తగ్గించడమే కాకుండా గుండెపోటు రాకుండా అడ్డుకుంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది.

శక్తి. అరటి పండ్లు శరీరానికి ఎక్కువ శక్తి క్యాలరీలను అందిస్తుంది మిగిలిన పండ్లతో పోలిస్తే అరటి పండ్లలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి ఫైబర్ తో కలిసిన గ్లూకోజ్ వంటివి శరీరానికి అత్యవసర శక్తిని అందిస్తాయి. కండరాల కదలికలను తిమ్మిర్లు తగ్గించేందుకు పొటాషియం సహకరిస్తుంది.

Five benefits of eating bananas : ఒత్తిడిని తగ్గించడం అరటిలో ఉండే ట్రిప్టోఫన్ అని అమినో ఆసిడ్ ను మెదడును ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ సిరేటోనిన్ మెదడును విశ్రాంతిగా ఉంచేందుకు సహాయపడుతుంది ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఉత్సాహం ను కలిగిస్తుంది.

గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More>>

🔴Related Post