food for hair growth and thickness : జుట్టు బలం కోసం తినవలసిన ఫుడ్స్….మన జుట్టు రాలడానికి మనం తీసుకునే ఆహారం ముఖ్యపాత్ర వహిస్తుంది. అందుకే ఆహారంపై శ్రద్ధ వహించి మన ఆహారంలో బయోటిక్ ఫుడ్స్ ఉండేలా చేసుకోవాలి.ఇప్పుడున్న కాలంలో బిజీ లైఫ్ లో రోజు దుమ్ము పొల్యూషన్ కారణంగా మన జుట్టు పొడిగా మారుతుంది. అంతేకాకుండా తలపై వెంట్రుకలు రాలడం తెల్ల జుట్టు రావడం. వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్నప్పటినుంచి చాలామంది ఈ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం అందరిలోనూ ఉంటుంది. జుట్టు రాలడం మరీ ఎక్కువగా ఉంటే మనం ఆందోళన చెందవలసి వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఖరీదైన షాంపూలు వాడుతుంటాం. మనం జుట్టు రాలిపోకుండా ఉండడం కోసం చాలా ఖర్చు చేస్తాం.
అయితే మనం తీసుకునే చికిత్సలు చాలా కాలం తర్వాత జుట్టును పాడు చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా మన దగ్గర ఉన్న డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. జుట్టు రాలిపోవడానికి మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. అందుకే ఆహారంపై శ్రద్ధ వహించడం అవసరం. మనం తీసుకున్న ఆహారంలో బయోటిక్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. అందులో ఉండే విటమిన్స్ జుట్టు కు తగిన పోషణ అందిస్తాయి. జుట్టు రాలడం తెల్లగా అవటం ఇలాంటి సమస్యలను తగ్గిస్తాయి. బయోటిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
food for hair growth and thickness
గుడ్లు
గుడ్లు సంపూర్ణ పోషక ఆహారం గుడ్డు బయోటిన్ అద్భుతమైన మూలంగా నిపుణులు తెలియజేశారు ముఖ్యంగా గుడ్డులోని పచ్చసోనల్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు పోషణకు ఎంతగానో తోడ్పడుతుంది. గుడ్డు తినడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది. జుట్టు రాలిపోకుండా చెక్ పెడుతుంది గుడ్డు తినడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది.
బాదంపప్పు
బాదం పప్పులో ఉండే పోషకాలు జుట్టుకు ఎంతో సహాయపడతాయి బాదం లో ఉండే ప్రోటీన్లు ఫైబర్ విటమిన్ ఈ పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి ఇవి బయోటిన్ కలిగి ఉంటుంది. ఇవి జుట్టుకు కావలసిన పోషణ ఇస్తాయి దీంతో జుట్టు బలంగా మారడమే కాకుండా రాలిపోకుండా కూడా సహాయపడతాయి. బాదం పప్పు తినడం వల్ల జుట్టుకే కాదు చర్మ ఆరోగ్యం కూడా ఎంతో మేలు చేస్తుంది.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో ఫైబర్ విటమిన్ ఏ బి సి తోపాటు ఐరన్ కాల్షియం జింకు పొటాషియం సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అధిక మోతాదులో బయటిన్ కూడా ఉంది. వీటిని తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా తలలోని దురద సమస్యలు రాకుండా సహాయపడుతుంది.
మెంతులు
మెంతుల్లో బయోటిన్ ఐరన్ రెండు కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతాయి మెంతులను పేస్ట్ చేసి వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో జుట్టు రాలకుండా ఈ మెంతులు సహకరిస్తాయి.
గమనిక : ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.