Foods not to eat at night : రాత్రి పడుకునే ముందు ఇవి తినకూడనివి. మన ఆరోగ్యం ముఖ్యపాత్ర పోషించేది ఆహారం ఎప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఈ సమయంలో తీసుకోవాలి వేటికి ఎప్పుడు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా రాత్రివేళ మన శరీరానికి ఎంత అవసరమో అంత నిద్ర కచ్చితంగా పోవాలి. ఇక మంచిగా హాయిగా నిద్రపోవాలి అనుకునేవారు ఆహారం తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందు తీసుకోకూడని ఆహారాలు
నిద్రపోయే ముందు రెండు గంటల ముందే ఆహారం తీసుకోవాలి అయితే రాత్రివేళ సులువుగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది అలా కాకుండా తెలిసి తెలియక కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది నిద్రపోవడం కష్టంగా మారుతుంది రాత్రివేళ పడుకునే ముందు తీసుకోకూడని ఆహారాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రివేళ పడుకునే ముందు కొన్ని రకాల డ్రింక్స్ ఫుడ్స్ తీసుకోకూడదు వీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరిగి సరిగా నిద్ర రాదు మనం పడుకునే ముందు తినే ఆహారం జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుంది. త్వరగా నిద్రపోకుండా చేస్తుంది రాత్రివేళ పడుకునే ముందు కాఫీ టీ చాక్లెట్ ని తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇవి నిద్ర రాకుండా భంగం కలిగిస్తుంది.
Foods not to eat at night రాత్రి పడుకునే ముందు బాగా కారం మసాలాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం మంచిది వీటిని తీసుకుంటే శరీరం వేడెక్కి నిద్ర రాకుండా చేస్తుంది. పిజ్జాలు బర్గర్లు ఇవి ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోకూడదు ఇవి తీసుకుంటే నిద్రను రాకుండా చేస్తుంది నిద్ర పట్టకుండా ఇబ్బందిగా ఉంటుంది. రాత్రివేళ పడుకునే ముందు తీపి పదార్థాలను కూడా తినకూడదు ఇవి కూడా మనకు నిద్ర రాకుండా చేస్తుంది.
నిద్రపోయే ముందు పచ్చి ఉల్లిపాయలు తినకూడదు.
ఇవి జీర్ణ వ్యవస్థలో గ్యాస్ ఏర్పడేలా చేస్తుంది దీంతో నిద్ర రాకుండా చేస్తుంది ఇక మనం నిద్రపోయే ముందు కూల్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదు నిద్ర వేలకు ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు ఒకవేళ అలా తాగితే అర్ధరాత్రి మూత్ర విసర్జనకు లేవవలసి వస్తుంది. ఇది కూడా నిద్రకు ఇబ్బంది రాత్రివేళ సిట్రస్ పండ్లు కూడా తినకూడదు ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే వాళ్ళు పైన తెలిపిన విషయాలని గుర్తించుకొని తినకుండా ఉంటే మంచిది.