Foods that reduce joint pain : కీళ్ల నొప్పులకు తీసుకోవాల్సిన ఆహారం ఈ కాలంలో చాలా మందికి కీళ్ల నొప్పులు వెంటాడుతూనే ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామందికి ఈ సమస్య ఉంది ఈ కీళ్లనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వంశపార్య పరంగా రావచ్చు ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల కూడా రావచ్చు లేదా శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి కారణమేదైనా సరే చాలా బాధగా ఉంటుంది అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులు తగ్గించే ఆహార పదార్థాలు
చేపలు
చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి వారానికి రెండు సార్లు చేపలు తినడం వల్ల మంచి మేలు జరుగుతుంది.
ఆకుకూరలు
బచ్చలి కూర పాలకూర మెంతికూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి.
పండ్లు
బత్తాయి నారింజ నిమ్మ వంటి సిట్రస్ పండ్లను విటమిన్ సి అధికంగా ఉంటుంది ఎంతో మేలు చేస్తుంది అలాగే చెర్రీలు వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి కీళ్లలో మంటను తగ్గిస్తాయి.
పసుపు
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది కీళ్లనొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది పసుపు పాలు తాగడం వల్ల లేదా కూరలో పసుపు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
అల్లం
అల్లం లో జింజెరల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది కీళ్ల నొప్పులు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది అల్లాన్ని టీ లో వేసుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి Foods that reduce joint pain
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది రోజు రెండు మూడు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యం సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న దగ్గర్లో ఉండే వైద్యులను సంప్రదించడం ఉత్తమమైనదిగా తెలియజేస్తున్నాను దీన్ని మీరు గమనించగలరు.