foods to eat for thyroid health : ఈరోజుల్లో చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. భారతదేశంలో దాదాపు ఈ సమస్య చాలామందికి ఉంది థైరాయిడ్ గ్రంధిలో అసమతుల్యత కారణంగా హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ గ్రంధిని పనితీరును మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. అయితే ఈ ఫుడ్డు హైపో హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నవారికి ఉపయోగపడుతుంది.
రోజు మన జీవన శైలు మార్పులు చెడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది థైరాయిడ్ సమస్యతో ఉన్నారు. ఈ సమస్య వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం జుట్టు రాలిపోవడం అలసట గర్భం దాల్చకపోవడం లాంటి సమస్యలు వస్తాయి..
మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారాన్ని కలిగి ఉండే గ్రంధి థైరాయిడ్ శరీరం శక్తిని వినియోగించుకునేందుకు వెచ్చగా ఉండేందుకు సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన హార్మోన్లను ఇది విడుదల చేస్తుంది థైరాయిడ్. గ్రంధిలో అసమతుల్యత యొక్క కారణంగా హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువ లేదు తక్కువ ఉత్పత్తి చేస్తుంది.
హైపర్ థైరాయిడిజం
హైపర్ థైరాయిజంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది టీ 3 టీ 4 హార్మోన్ ఎక్కువగా విడుదలై టిఎస్ హెచ్ తగ్గిపోతుంది దీని ద్వారా బరువు తగ్గిపోవడం. అకారణంగా చెమటలు పట్టడం పేగుల కదలిక ఎక్కువ జరిగి విరోచనాలు కావడం ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్ర పట్టకపోవడం మానసిక ఒత్తిడి చల్లగా ఉన్న వేళలోనూ వేడిగా అనిపించడం ఎక్కువగా చెమట పోవడం ఎక్కువసార్లు మలవిసర్జనకు రావడం వంటి లక్షణాలు ఉంటాయి.
హైపో థైరాయిజం foods to eat for thyroid health
ఈ హైపోథైరాయిజం హార్మోన్ తక్కువగా విడుదలవుతుంది టీ 3 టీ 4 హార్మోన్లు తగ్గుతాయి టీఎస్ హెచ్ పెరుగుతుంది. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది దీనివల్ల నీరసంగా కనిపిస్తాం శరీరంలో బలహీనంగా ఉంటుంది. బరువు పెరిగిపోతారు వేడిగా ఉండే టైం లో చల్లగా అనిపిస్తుంది వీళ్ళకి. వీటితోపాటు మళ్ల బద్ధకం గుండె తక్కువ కొట్టుకోవడం ఒళ్ళు నొప్పులు డిప్రెషన్ రక్తహీనత ఇలాంటి మార్పులు కనిపిస్తాయి థైరాయిడ్ సమస్యకు చెక్కుపెట్టి థైరాయిడ్ గ్రంధినీ మెరుగుపరచాలనుకుంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి దీనికి తోడు వ్యాయామం చేయడం కూడా సహాయపడుతుంది.
ఉసిరి
ఉసిరికాయ లో ఉండే విటమిన్ సి మీ థైరాయిడ్ గ్రంథిని అతిగా క్రియాశీలంగా పనిచేస్తుంటే ఈ ఉసిరి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం జింక్ ఇవి వీటితోపాటు విటమిన్లు మినరల్స్ శరీరం గ్రహించడానికి సహాయపడతాయి జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి నియంత్రణకు సహాయపడుతుంది.
పచ్చికొబ్బరి
పచ్చి కొబ్బరి లేదా కొబ్బరినూనె థైరాయిడ్ రోగులకు మంచి ఆహారం ఇది జీవ క్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.
పెసల్లు
పెసల్లో ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు కార్బోహైడ్రేట్ విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి థైరాయిడ్ గ్రంధిని మెరుగైన పనితీరుకు ఉపయోగపడుతుంది.
గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యం సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న దగ్గర్లో ఉండే వైద్యులను సంప్రదించడం ఉత్తమమైనదిగా తెలియజేస్తున్నాము దీన్ని మీరు గమనించగలరు.