Game changer song కు 20 కోట్ల రూపాయలు Shankar గారు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. గేమ్ చేజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ డైరెక్ట్ తెలుగు సినిమా ఇది. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ గారు నటిస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ గేమ్ చేజర్ సినిమా మీద మొదలు పెట్టినప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.కానీ ఈ సినిమా రోజు రోజుకు పోస్ట్ పోన్ అవుతూ వస్తూ సినిమా మొదలుపెట్టినప్పుడు ఉన్న అంచనాలను ఇప్పుడు అందుకోలేక పోతుందని చెప్పవచ్చు. ఈ సినిమాను దిల్ రాజు గారు భారీ లెవెల్ లో డబ్బులను ఖర్చు చేయడం జరుగుతుంది.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా సినిమా మొదలుపెట్టినప్పుడు ఉన్నంత అంచనాలు ఇప్పుడు మాత్రం లేవు.అందుకు చాలా కారణాలు చెప్పవచ్చు. అవి ఏమిటంటే ఒకప్పుడు సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ లో నెంబర్ వన్ స్థానంలో శంకర్ గారు ఉండడం జరిగింది. ఒకప్పుడు శంకర్ గారు సినిమా అంటే సౌత్ ఇండియా తో పాటు నార్త్ ఇండియన్ కూడా చాలా వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే శంకర్ గారు సినిమాలో భారీతనంతో పాటు స్టోరీ మరియు ఒక సోషల్ మెసేజ్ కూడా ఉండేది. శంకర్ గారి సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలు సాధిస్తూ ఒక సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా శంకర్ గారు సినిమాలు భారీ విజయాలు సాధించిన చాలా ఉన్నాయని చెప్పవచ్చు.
ఒకానొక సమయంలో శంకర్ గారి సినిమాలో చాలా సినిమాలు భారీ లెవెల్ లో విజయాలు సాధించడం జరిగింది.ఒక విధంగా చెప్పాలంటే శంకర్ గారి దర్హకత్వంలో వచ్చిన రోబో సినిమా చూస్తే మనం హాలీవుడ్ సినిమా చూశాము అనే భావన మన అందరిలో కలిగించింది ఒకే ఒక్క డైరెక్టర్ శంకర్ గారు మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే శంకర్ గారి భారీ లెవెల్ లో సినిమా తీసి భారీ విజయం సాధించిన సినిమా కూడా రోబో మూవీ అని చెప్పవచ్చు. ఆ తర్వాత శంకర్ గారు తీసిన ఏ సినిమా గాని విజయాన్ని సాధించలేక పోయింది.రోబో 2 సినిమా భారీ లెవెల్ లో తెరకెక్కి పరవాలేదనిపించింది గాని రోబో 2 మూవీ బడ్జెట్ చాలా ఎక్కువగా అవ్వడం వల్ల బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది గాని ఎక్కడ లాభాలను తేలేకపోయింది.
ఆ తర్వాత Shankarగారు తీసిన భారతీయుడు 2 సినిమా భారీ లెవెల్ లో విడుదలై అన్ని భాషలలోనూ ఘోరంగా పరాజయాన్ని పొందడం జరిగింది. చివరికి తమిళనాడులో కూడా ఘోరమైన ప్లాపును ఎదుర్కొంది భారతీయుడు 2 సినిమా. అసలు భారతీయుడు 2 సినిమా చూసిన వారికి ఆ మూవీని శంకర్ గారే తీశారా అనే సందేహం కూడా కలిగిందని చెప్పవచ్చు. భారతీయుడు 2 సినిమా దెబ్బకు శంకర్ గారి పరువు పూర్తిగా పోయిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తమిళనాడులో గత ఐదు సంవత్సరాల్లో ఇంత భారీ ప్లాపును సాధించిన సినిమా లేదని అక్కడి వాళ్లే చెప్పడం గమనార్ధం. ఆ లెవల్లో ప్లాప్ అయింది భారతీయుడు 2 సినిమా.
Shankar రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వస్తున్న Game changer మూవీ మీద ఇప్పుడు అంత ఆసక్తి ఎవరు చూపడం లేదు. అంతెందుకు గేమ్ చేంజర్ మూవీ ని కొనడానికి బయ్యర్లు కూడా ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే శంకర్ గారి సినిమాలు ఘోరంగా పరాజయాన్ని పొందడమే కాక అందులో నటించిన హీరోకు కూడా చెడ్డ పేరు తీసుకొని వస్తుంది. ఈ Game changer సినిమా మీద దిల్ రాజు గారు భారీ లెవెల్ లో డబ్బులు పెట్టడం జరిగింది. కానీ గేమ్ చేంజర్ మూవీ నుంచి విడుదలైన ఏ ఒక్క పాట కూడా ఎవ్వరికి ఎక్కడం లేదు. గేమ్ చేంజెర్ మూవీ నుంచి వచ్చిన ప్రతి పాట విడుదలైన రోజు మాత్రం వైరల్ గా మారుతుంది గాని విడుదలైన పాటలు మాత్రం ఎవ్వరికి వినసొంపుగా గా అనిపించడం లేదు. ఇది కూడా గేమ్ చేంజర్ మూవీకి మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు.
ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా ఎవరిని ఆకట్టుకోలేకపోవడం జరిగింది. ఇప్పుడు వస్తున్నా న్యూస్ ప్రకారం గేమ్ చేంజర్ మూవీలోని మూడవ పాట ఈనెల చివరి వారంలో విడుదల చేయడం జరుగుతుందని తెలుస్తుంది. ఆ పాటకు శంకర్ గారు 20 కోట్ల రూపాయలు పెట్టించారని తెలుస్తుంది. చూడాలి ఆ పాట అయినా విజువల్ గా ఎలా ఉంటుందో మరియు పాట వినడానికి ఎలా ఉంటుందో.దిల్ రాజు గారు ఇప్పటి నుంచైనా గేమ్ చేంజర్ మూవీ ని జాగ్రత్తగా ప్రమోట్ చేస్తూ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.