Gongadi Trisha కు రేవంత్   ప్రభుత్వం కోటి నజరానా ప్రకటించారు 

Written by 24 News Way

Published on:

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన యువ క్రికెటర్ Gongadi Trisha ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్పులో తన అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేసిన త్రిషను తన నివాసంలో సీఎం మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

కోటి రూపాయల ప్రోత్సాహకం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో Gongadi Trisha ప్రతిభను ముఖ్యమంత్రి కొనియాడుతూ కోటి రూపాయల నజరానా ప్రకటించారు. . “నీ ప్రతిభ తెలంగాణ గర్వించదగినది. భవిష్యత్తులో భారత జట్టును ఇంకా గెలిపించాలి” అంటూ త్రిషకు ప్రోత్సాహం అందించారు.

ధృతి కేసరికి రూ. 10 లక్షల రూపాయలు

అండర్-19 మహిళల వరల్డ్ కప్ టీమ్ సభ్యురాలిగా నిలిచిన మరో తెలంగాణ క్రీడాకారిణి ధృతి కేసరి ను కూడా ముఖ్యమంత్రి అభినందించారు. ధృతి కేసరి ప్రతిభను గుర్తిస్తూ 10 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు.

కోచ్, ట్రైనర్లకు కూడా ప్రోత్సాహం ప్రకటించారు

కేవలం క్రీడాకారులకే కాకుండా, వారిని తీర్చిదిద్దిన కోచ్లు, ట్రైనర్లకు కూడా గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వం యొక్క లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అండర్-19 మహిళల టీమ్ హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినిలకు చెరో 10 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.

మహిళా క్రీడాకారుల ఎదుగుదలకు  తెలంగాణ  ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “మహిళా క్రికెట్ను అభివృద్ధి చేసే దిశ గా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు. ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు ఉత్తమ శిక్షణ అందజేస్తుంది” అని తెలిపారు.

మలేషియా వేదిక ఫై 309 పరుగులు.. 7 వికెట్లు

ఫైనల్ లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి వరుసగా రెండో సారి ఛాంపియన్ గా నిలిచారు.మలేషియా వేదికగా జరిగిన మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. . ఈ కప్ సాధించడంలో Gongadi Trisha కీలక పాత్ర పోషించింది. బ్యాట్, బంతితో ఆల్ రౌండ్ షో చేసి ఆకట్టుకుంది. తుది పోరులో 33 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ 3 వికెట్లు తీసింది. మొత్తంగా ఈ టోర్నీలో 77.25 సగటుతో 309 పరుగులు చేసింది త్రిష. ఇందులో ఓ అజేయ శతకం కూడా ఉంది. బౌలింగ్ లో 7 వికెట్లు తీసి ఆకట్టుకుంది.

“తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం!”.

హైలైట్ గా నిలిచిన సెంచరీ

త్రిష సెంచరీ ఈ టోర్నీ మొత్తానికే .హైలైట్ గా నిలిచిన సెంచరీ స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ శతకాన్ని నమోదు చేసింది త్రిష. తద్వారా అండర్ 19 మహిళల ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా త్రిష రికార్డు సృష్టించింది.

Also Read >>

🔴Related Post