Telangana farmers Good news: క్వింటా వరి కి 500 రూపాయల బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు ఒక మంచి శుభవార్త చెప్పింది అని అనుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్ల కు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది .ఈ సీజన్ నుంచే సన్న వడ్ల కు కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది .సోమవారం సమావేశం అయినా క్యాబినెట్ సబ్ కమిటీ వరి పంటల కు బోనస్ మరియు కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా చర్చించడం జరిగింది. భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ మరియు పొంగులేటి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు.
సన్న వడ్లకు వానాకాలం నుంచి క్వింటాకు 500 రూపాయల చొప్పున ఇస్తామని Telanganaప్రభుత్వం ప్రకటించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు చాలా హామీలు ఇచ్చింది అందులో ప్రధానమైన హామీ రైతు రుణమాఫీ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అందరికీ రుణమాఫీ చేయలేదు చాలామంది అన్నదాతలు రుణమాఫీ కాహ ఆందోళన చెందుతున్నారు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇక ఎన్నికల్లో వరి పంటకు 500 రూపాయల బోనసి అని ప్రకటించడం జరిగింది అధికారంలోకి రాగానే సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ లు అని చెప్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం జరుగుతున్నాయి .ఇక రైతు భరోసా ఇంకా రైతుల ఖాతాలోకి జమ చేయలేదు వానాకాలం సీజన్ సగం పూర్తి అయింది గానీ ఇంకా రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లోకి రాలేదు. ఇది కూడా కొంతమందికి ఇచ్చి అందరికీ ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకుంటుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం పదిమంది ఉంటే ఇద్దరికీ ఇచ్చి అందరికి ఇచ్చినట్టు ప్రచారం చేయించుకుంటుందని టిఆర్ఎస్ నాయకులు ,బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది.
మొన్నటి మొన్న వేసవికాలంలో అకాల వర్షాలతో పంటలు చాలా నష్టపోయారు Telangana రైతులు . దీంతో ప్రభుత్వం ఎకరాకు పదివేల పరిహారం ప్రకటించింది . కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు కూడా ప్రకటించింది కానీ రైతుల ఖాతాల్లోకి మాత్రం డబ్బు చేరలేదు .దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని రైతులను మోసం చేసినట్లుగా రైతులు భావిస్తున్నారని మరియు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోతుందని రైతు సంఘాలు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ కాలాన్ని వెలదీస్తుందని కానీ రైతుల అమాయకులు కాదని గుర్తు చేస్తున్నాయి రైతు సంఘాలు.