gunasekhar new movie : సీనియర్ డైరెక్టర్ కొత్త మూవీ రాబోతుంది..క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తన కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీశారు. బాల రామాయణం, చూడాలని ఉంది, మనోహరం, ఒక్కడు, లాంటి మరుపురాని చిత్రాలను తెలుగు ఇండస్ట్రీకి అందించాడు. అయితే గత కొన్ని ఏళ్లుగా ఆయన తన రేంజ్ కు తగ్గ హిట్ కొట్టలేదు చివరగా శాకుంతలం సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు దీంతో కాస్త గ్యాప్ తీసుకొని యుఫోరియా అనే న్యూ ఏజ్ ఫిలిం తో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నారు.
టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరోవైపు పౌరాణిక చరిత్రక సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. భారీ బ్లాక్ బాస్టర్లు అందుకున్నాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన సరైన హిట్టు కోసం చాలా ఏళ్లుగా కష్టపడుతున్నారు కానీ ఏది బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుట్ అవ్వడం లేదు అయినా సరే పట్టు వదలనీ విక్రమార్కుల్లా హిట్టు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
2003 లో వచ్చిన ఒక్కడు తర్వాత గుణశేఖర్ ఆరెంజ్ సక్సెస్ మళ్లీ పడలేదు అర్జున్, సైనికుడు, వరుడు, సినిమాలను నిరాశపరిచాయి దాదాపు ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుద్రమదేవి చిత్రం ఓ మోస్తారు విజయం సాధించింది మధ్యలో నిర్మాతగా చేసిన “నిప్పు” సినిమా కూడా ప్లాప్ అయింది. దీంతో ఆయన 8 సంవత్సరాలు విరామం తీసుకుని శాకుంతలం సినిమా చేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ డిజాస్టర్ గా మారింది.
gunasekhar new movie సమంత ప్రధాన పాత్రలో శకుంతలం సినిమా ని తెరకెక్కించారు. గుణశేఖర్ తన కుమార్తె నీలిమ నిర్మాతగా గుణ టీమ్ వర్క్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించాడు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కూడా మూవీ ప్రొడక్షన్ లో జాయిన్ అయ్యాడు. అయితే 2023 సమ్మర్ లో వచ్చిన చిత్రం అయితే 2023 సమ్మర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయం చూసింది. అలాంటి భారీ ఫ్లాఫ్ వచ్చిన నిరాశ చెందకుండా గుణశేఖర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు యుఫోరియా అనే మరో కొత్త మూవీ ని రెడీ చేస్తున్నారు.