health benefits of drinking buttermilk : మజ్జిగలో గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని తాగడం వల్ల కలిగే లాభాలు..మారుతున్న కాలంతో పాటు ఆహారం తీసుకోవాలి వేసవిలో మనము అప్పుడప్పుడు మజ్జిగ తాగుతాం వీటి వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ మజ్జిగ తాగేటప్పుడు అందులో కొద్దిగా పుదీనా దానితోపాటు ఇంగువ కూడా వేస్తే మరింత ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే ఆహార పదార్థాలు తినడం మంచిది. అయితే అందులో ముఖ్యమైన ఆహారం మజ్జిగ పొట్టను చల్ల బరిచి జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారం ఇది మీరు ప్రతి రోజు వేసవిలో పుదీనా మజ్జిగ తాగితే మనకు ఎంతో ఆరోగ్యం పుదీనా మధ్యలో ఇంగువను వేసుకొని తాగడం వల్ల గ్యాస్ ఎసిడిటీ పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
మజ్జిగ ఇలా తయారు చేయండి
పుదీనా మజ్జిగ కోసం ఇంట్లో ఉన్న పెరుగుతోనే మజ్జిగని చిలకండి ఒక గ్లాసులో ఆ మజ్జిగను వేసి గుప్పెడు పుదీనా ఆకులు మిక్సీలో రుబ్బి వాటిని కూడా వేయండి పుదీనా తో పాటు పచ్చిమిరపకాయను వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి ఉంచి అందులో ఒక స్పూన్ ఆవాల నూనె ఆ నూనెలో జీలకర్ర ఇంగువ వేసి వేయించండి వేయించిన దానిలో మజ్జిగ పోసి కలిపేయండి. ఇది బాగా చల్లబడ్డాక తాగండి. ఇది పొట్టలోని వేడిని పీల్చేస్తుంది. జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది ప్రతిరోజు దీన్ని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మజ్జిగతో ఆరోగ్యం (health benefits of drinking buttermilk)
మజ్జిగ ఎంతో ఆరోగ్య కరం అందులో మనం వేసిన పుదీనా ఇంగువ ఆవాల నూనె ఇవన్నీ కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. పుదీనా ఆకులు మన శరీరాన్ని వికారం నుండి కాపాడుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యను కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి మజ్జిగలో పుదీనా వేసుకొని తాగితే ఎంతో ఆరోగ్యం. మజ్జిగలో వేసిన ఇంగువ కూడా మనకు శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. కఫం ఉత్పత్తిని తగ్గిస్తుంది చాతిపై ఒత్తిడి పడకుండా ఇది అడ్డుకుంటుంది. శాసనాళాలు వాచిపోవడం ఉబ్బరం వంటి సమస్యలు ఇది రాకుండా చూసుకుంటుంది. కాబట్టి వేసవిలో మజ్జిగతో చిటికెడు ఇంగువ పుదీనా కలిపి తాగడం వల్ల మనకు ఎంతో హాయిగా అనిపిస్తుంది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.