Health benefits of orange : నారింజ పండ్లు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.. మనం రోజు ఎన్నో రకాల పండ్లు తింటూ ఉంటాం అవి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. అందుకే సమయానుకూలంగా పండ్లను తినాలంటున్నారు వైద్య నిపుణులు అలాంటి పండ్లలో నారింజ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నారింజ పండులో అనేక రకాల పోషకాలు ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు బీటా కెరోటిన్ పొటాషియం మెగ్నీషియం ఫైబర్ తో పాటు విటమిన్ సి కావలసినంత ఉంటుంది. మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది దీంతో పాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది.శీతాకాలం తో పాటు అన్ని రకాల సీజన్లో దొరికే ఈ పండును సాధారణంగా తిన్న లేక జ్యూస్ చేసుకుని తాగిన అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీలైనప్పుడల్లా నారింజ పండ్లు తినడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Health benefits of orange
బరువు తగ్గడానికి నారింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది నారింజలో ఉండే ఫైబర్ ఆకలిని అరికట్టి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది దీనివల్ల మీరు ఎక్కువ ఆహారం తీసుకోలేరు కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
చర్మ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. నారింజలో ఆమ్లాలు విటమిన్లు ఖనిజాలు విటమిన్ సి అత్యధికంగా ఉంటాయి. అవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. వీటిని తినడం ద్వారా చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. దీంతో పాటు చర్మానికి సంబంధించిన కోలాజెన్ ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది నారింజలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది దీని ద్వారా గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఆరెంజ్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఆరెంజ్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఫైబర్ కాలేయానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రక్తం గడ్డకట్టకుండా నివారించే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రోగ నిరోధక శక్తి నారింజలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో భాగ సహాయపడుతుంది ఈ పండ్లలోని ఫోలేన్ రాగి వంటి అనేక పోషకాలు మన ఇమ్యూనిటిని పెంచి ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
కిడ్నీలో రాళ్లు శరీరంలో సిట్రేట్ లోపం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అయితే నారింజ సీక్రెట్స్ స్థాయిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. తద్వారా మూత్రపిండాలు రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. నారింజలో కాల్షియం కూడా మూత్రసమస్యలను. నివారించడంలో సహాయపడతాయి.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.