HealthTips మనం గురక పెట్టడం వల్ల నష్టాలు వస్తాయని మీకు తెలుసా. నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం వదలడం చేసినప్పుడు మనం మెడ తలలోని మృదు కణజాలంలో కంపనాల వల్ల మనము గురక పెడుతుంటాము ముక్కు రంధ్రాల టాన్సిల్ నోటిపై భాగంలో ఉంటుంది మనము నిద్రపోతున్న సమయంలో వాయు మార్గం విశ్రాంతి స్థితిలో ఉంటుంది ఆ సమయంలో గాలి చాలా బలవంతంగా లోపలికి వెళ్ళవలసి వస్తుంది. అందుకే మృతి కణజాలంలో కంపనాలు ఏర్పడడం జరుగుతాయి. దానివల్ల మనకు గురకనేది వస్తుంది.
HealthTips:
మనం గురక పెట్టడానికి ముఖ్యమైన కారణాలు:
శ్వాస తీసుకునే మార్గంలో అడ్డంకులు: శ్వాస మార్గంలో వాపు విచలనం చెందిన సిస్టం పెద్ద టాన్సిల్ వంటివి శ్వాస మార్గాన్ని అడ్డుకోవడం వల్ల మనకు గురక వస్తుంది.
అధిక బరువు ఉన్న కూడా గురకబెట్టడానికి కారణం: అనంగా అధిక బరువు ఉన్న వారిలో గొంతులో కొవ్వు పేరుకుపోవడం వల్ల శ్వాస మార్గం సన్నబడి కోరకనేది రావడం జరుగుతుంది.
మందు ఎక్కువగా తాగడం వలన గురక వస్తుంది:. మందు ఎక్కువగా తీసుకోవడం వలన ఆ ప్రభావం మెదడు మీద పడి శ్వాస కండరాలను చదలించడం వల్ల గురకరావడం జరుగుతుంది.
అలర్జీలు మరియు జలుబులు ఎక్కువగా ఉండటం వల్ల గురకరావడం జరుగుతుంది. ముఖ్యంగా జలుబు చేయడం వలన శ్వాస మార్గం వాపు కావడం వల్ల గురక ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది చాలామందిలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
వయసుతోపాటు గొంతు కండరాలు బలహీన పడటం వల్ల కూడా గురక వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.
గురక వల్ల మనకు వచ్చే సమస్యలు:
నిద్ర సరిగా పట్టకపోవడం: గురక అధికంగా ఉన్నప్పుడు మనకు నిద్రలో మెలిక రావడం వలన నిద్ర సమస్య రావడం జరుగుతుంది. నిద్ర సమస్య వల్ల ఎప్పుడు శరీరంలో అలసటగా కనిపిస్తూ ఉంటుంది. ఇది నిదానంగా మూర్ఛ కు దారి తీయవచ్చు.
గుండె సమస్య: ఎక్కువ కాలం గురక ఉన్నచో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రక్త పోటు పెరగడం: గురక ఎక్కువగా రావడం వల్ల రక్తపోటు కూడా పెరుగుతుంది.
మెదడు మీద ప్రభావం: నిద్రలో శ్వాసాగిపోవడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు.
HealthTips :
గురకను నివారించడానికి మార్గాలు;
. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడం ద్వారా గోరకను తగ్గించుకోవచ్చు.
. తిరగల పండుకునే అలవాటు ఉన్నవాళ్లు కుడివైపు కాని ఎడమవైపు కాని పండుకోవడం వల్ల గురక తగ్గించుకోవచ్చు.
. మద్యం అలవాటు మానేయడం వల్ల గురక చాలా వారికి తగ్గుతుంది.
. అలాగే నిద్ర సంబంధించిన మాత్రలు వేసుకునే అలవాటు ఏమైనా ఉంటే దానిని కూడా తగ్గించుకోవడం చాలా మంచిది.
. గురక ఎక్కువగా వచ్చేవారు జలుబు అలర్జీలకు దూరంగా ఉండటం మంచిది.
. ఇవన్నీ చేసిన గాని మీ గురక తగ్గకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించగలరు.
. వీటితోపాటు ఉదయాన్నే రన్నింగ్ చేయడం. తగినంత ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మరియు బయట జంక్ ఫుడ్ ని మానేయడం మన హెల్త్ కు చాలా మంచిది.