Health Updates: షుగర్ ని తరిమికొట్టాలంటే ఇలా చేయండి .ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి షుగర్. షుగర్ అనేది ఒకప్పుడు 50 సంవత్సరాలు తర్వాత వచ్చేది కానీ ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లల కూడా షుగర్ వ్యాధి కనిపిస్తుంది . ఇలా ఎందుకంటే చిన్నపిల్లలు కూడా జంక్ ఫుడ్ కి అలవాటు పడడం పిల్లలు తీసుకునే ఆహారంలో కూడా కల్తీ చేరడం ఇవన్నీ ఒక కారణాలుగా చెప్పవచ్చు మరియు రోజు రోజుకి మారుతున్న జీవనశైలి శారీరక శ్రమ లేకుండా ఏసీ గదుల్లో అధిక సమయం కూర్చొని పని చేస్తూ ఉండటం వలన మారుతున్న ఆహారపు అలవాట్ల ను అన్ని కలుపుకొని షుగర్ వ్యాధి బారిన ముఖ్యమైన కారణాలు అవుతున్నాయి . షుగర్ ని రాకుండా చూసుకోవడానికి లేదా వచ్చిన షుగర్ ని అదుపు చేయడానికి అనేకమార్గాలున్నప్పటికీ ఆ దిశగా మనము ప్రయత్నించక అనేక రోగాల బారిన పడుతున్నాము అయితే షుగర్ ను నియంత్రించడానికి కూడా కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం,
1. కాకరకాయ:
కాకరకాయ అంటేనే ఎవరు తినడానికి ఎక్కువ ఇష్టపడరు. మన నోటికి ఏదైతే చేదుగా ఉంటుందో అది శరీరానికి మరియు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది షుగర్ వ్యాధి బారిన పడినవారు ప్రతిరోజు కాకరకాయ రసం తాగాలి దీనివల్ల షుగర్ అదుపులో ఉంటుంది పాళీ ప్రెస్ లేట్ సమ్మేళనం వల్ల శరీరంలోని షుగర్ లెవల్స్ ను ఎల్లప్పుడూ కంట్రోల్ చేస్తుంది.
2. మెంతులు:
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో నానబెట్టుకోవాలి తర్వాత రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే పరిగడుపున ఈ నీటిని తీసుకోవాలి దీనివల్ల చక్కర స్థాయిలో అదుపులో ఉంటాయి అలాగే షుగర్ ఉన్నవారు ప్రతిరోజు 10 గ్రాముల మెంతులను నానబెట్టి తర్వాత రోజు ఉదయం తాగాలి. దీనికి సంబంధించిన ఒక కథనం కూడా జర్నల్లో ప్రచురితమైనది ఇలా చేయడం వల్ల హిమోడ్లోబిన్ తగ్గుతుంది
3 ఉసిరికాయ :
ఉసిరికాయ రసం తాగాలి ఆయుర్వేదం ప్రకారం ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది . దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే మూడు ఉసిరికాయలను తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మల్ల గ్లాసు నీరు కలిపి మిక్సీ గ్రైండ్ చేయాలి ప్రతిరోజు ఉదయం లేవగానే పరిగడుపున తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి .అని మన ఆయుర్వేద శాస్త్రం కూడా తెలియజేస్తుంది.
4. దాల్చిన చెక్క:
షుగర్ ఉన్నవారు దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది గ్లాసు వేడి నీటిలో నాలుగు చిన్న చిన్న దాల్చిన చెక్కలను వేసి మూత పెట్టాలి అలా పది నిమిషాల సమయం గడిచిన తర్వాత ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత దీన్ని తాగాలి దీనివల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ సాయిలు అదుపులో ఉంటాయని తెలుస్తుంది. For more Health Updates…