hero nani latest movie : అందమైన ప్రేమ కథ బలమైన డ్రామా గొప్ప సందేశం ఉంది. ఈ మూవీలో చిత్రం పేరు “కోర్ట్” ది స్టేట్ వర్సెస్ నో బడి దీని విషయంలో నేను అందరికి ఒక మాట చెబుతున్నా. ఈ మూవీ పూర్తయ్యేసరికి థియేటర్లో చూస్తున్న ప్రతి ఒక్కరు లేచి నిలబడి చప్పట్లు కొడతారని. కచ్చితంగా చెప్తున్నాను అని అన్నారు. హీరో నాని ఆయన సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ తెరకెక్కించారు ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
హర్ష రోషన్ శ్రీదేవి జంటగా నటించారు శివాజీ సాయికుమార్ రోహిణి తదితరులు ముఖ్యపాత్రలో నటించారు ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాదులో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో చిత్ర సమర్పకుడు నాని మాట్లాడుతూ ఈ సినిమాలో సృష్టించిన అంశం చాలా సున్నితమైనది ఇలాంటి కథలు చెప్పేటప్పుడు చిన్న ఒత్తు పొల్లు కూడా పక్కకు పోకూడదు.
hero nani latest movie : అందుకే దర్శకుడు జగదీష్ చాలా రీసెర్చ్ చేశాడు. ఈ మూవీలో ప్రత్యేకంగా ఫలానా వాళ్ళ హీరో అని చెప్పడం చాలా కష్టం నాకు ప్రియదర్శిని చేసిన బలగం సినిమా చాలా ఇష్టం కానీ ఈ కోర్ట్ తన కెరియర్లో అత్యుత్తమ చిత్రంగా బలగంతో పోటీ పడుతుంది. అని నమ్ముతున్నాను. అలాగే హర్ష శ్రీదేవి నటన వాళ్ళ అందమైన ప్రేమ కథ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పూర్తిగా అయిపోయేపాటికి సినిమా నుంచి మంచి సందేశం అందుకుంటారు. ఇది తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని వాస్తవ సంఘటనలను దాని తాలూకు కేసులను ఆధారంగా చేసుకొని ఫిక్షనల్ గా ఈ కథ అల్లుకున్నాం.
నాని నిర్మాణంలో చేయడం వల్ల ఇది మరింత ఎక్కువ మందికి చేరువ చేసే అవకాశం దొరుకుతుందని నమ్ముతున్నాం. దర్శకుడు రామ్ జగదీష్ నటుడు ప్రియదర్శిని మాట్లాడుతూ నాకు కోర్టు డ్రామాలు ఉన్న చిత్రం చాలా ఇష్టమని అన్నారు ఈ కథ విన్నప్పుడు అందరికీ స్ఫూర్తిని నిచ్చే మూవీ అవుతుందనిపించింది. ఈ మూవీ చూశాక చాలామందికి న్యాయ వ్యవస్థ పైన న్యాయవాదుల పైన గౌరవం పెరుగుతుందని నమ్ముతున్నా అని అన్నారు ఈ కార్యక్రమంలో హర్ష దీప్తి గంట శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.