hero nani latest movie news : ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తున్న నాని ఇప్పుడు నిర్మాతగా చేస్తున్నాడు. తక్కువ సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ ఆ మూవీస్ మంచి హిట్ కొడుతున్నాయి. తాజాగా ప్రియదర్శి ముఖ్య పాత్రలో కోర్ట్ అనే సినిమాని నిర్మించారు. ఇది మార్చి 14న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ సినిమా గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
హీరో నాని కోర్టు అనే మూవీని నిర్మించారు. ఈ మూవీకి నాని నిర్మాతగా పనిచేశారు. ప్రియదర్శి ముఖ్యపాత్రలో నటిస్తూ రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం మార్చి 14న రిలీజ్ కాబోతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం తో హీరో నాని ఓ చిట్ చాట్ చేశారు. ఇందులో ప్రియదర్శి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. కోర్టు సినిమా గురించి తనతో చిరంజీవి చెప్పిన మాటల్ని ప్రియదర్శి గుర్తు చేసుకున్నాడు.
ఇంతకుముందే నేను చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను. అక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే సార్ పక్కనే షూటింగ్లో ఉన్నారు అన్నపూర్ణలో విశ్వాంభర షూటింగ్ జరుగుతుంది. నేను వెళ్లి చూస్తుంటే సడన్ గా నా దగ్గరకు వచ్చి నిన్ను ఈమధ్య చూశాను అబ్బా ఏదో సూట్ లో ఉన్నావు నువ్వు చాలా బాగున్నావు ఫోటోలో అంటూ చిరంజీవి గారు నన్ను పలకరించారు. ఒక ఐదు నిమిషాలు మన కోర్టు మూవీ గురించి తనతో మాట్లాడాను. వెంటనే ఆయన నాని చేస్తున్నాడు ఈ మూవీ అయితే ఓకే అయిపోయినట్లే బావుంటుందిలే. అని చిరంజీవి గారు అన్నారు అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి నాని సినిమా అనగానే అంత ఈజీగా అయితే హిట్టే అన్నట్లు చెప్పారు. అంటూ ప్రియదర్శి అన్నాడు.
hero nani latest movie news ఇక దీనికి తేగ నవ్వుకున్న నాని ఇటీవలే చిరంజీవితో తనకి ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నాడు నేను మొన్న చైతన్య పెళ్లికి వెళ్లి కారు దిగి లోపలికి ఎంటర్ అవుతున్నాను చిరంజీవి గారు బయటకు వస్తున్నారు వెంటనే ప్రొడ్యూసర్ గారు అంటూ దండం పెట్టబోయారు వామ్మో అంటు వెనకాల ఎవరైనా ఉన్నారా అంటూ చూసుకున్నాను వెంటనే కలిసి హగ్ ఇచ్చారు ఈ విషయాన్ని నాని చెప్పారు.
ఇక చిరంజీవితో నాని ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే తన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ తో చిరంజీవి చేయబోయే సినిమాని నానినే ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంతో నాని టెస్ట్ గురించి చిరంజీవి ఇలా మాట్లాడారు అనమాట. మరి శ్రీకాంత్ చిరంజీవి గురించి ఎలాంటి కథని సిద్ధం చేశారో చూడాలి ఇప్పటికే నానితో దసరా సినిమా తీసి బ్లాక్ బాస్టర్ అందుకున్నారు శ్రీకాంత్.