హీరో సూర్య కంగువా మూవీ వాయిదా: హీరో సూర్య నటించిన కంగువ మూవీ వాయిదా పడిందని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు చర్చిస్తుంది. సౌత్ టాప్ హీరోలలో సూర్య కూడా ఒకరు. ఇప్పుడు ఎక్కువ శాతం పాన్ ఇండియా సినిమాలు వస్తున్న నేపథ్యంలో సూర్య కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఆ మూవీ పేరు కొంగువా శివ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తెలుగు తమిళ్ కానట్ మలయాళం హిందీ భాషలతో పాటు ఇంకా కొన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాలంటే తెలుగు సినిమాలనే ముద్ర ఉంది. తమిళ్ వాళ్ళు కూడా తెలుగు సినిమాలకు పోటీగా కొన్ని పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను విడుదల చేశారు గాని అవి అంతగా జనాదరణ పొందలేదు కానీ రజనీకాంత్ గారి జైలర్ మూవీ కమలహాసన్ గారి విక్రమ్ మూవీ మాత్రము పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయి విజయాలు సాధించాయి ఆ తర్వాత విజయ్ గారు లోకేష్ కనకరాజు కాంబోలో వచ్చిన మూవీ మాత్రం తమిళ్లో తప్ప ఏ లాంగ్వేజ్ లో హిట్ అవలేదు. రీసెంట్గా శంకర్ గారి డైరెక్షన్లో కమలహాసన్ గారి నటించిన భారతీయుడు సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయగా అన్నిచోట్ల డిజాస్టర్ గా మెలిగిపోయింది.
వాటిని ఏమీ పట్టించుకోకుండా సూర్య గారు కంగువా మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం జరిగింది.. ఈ సినిమా టైం ట్రావెల్స్ సంబంధించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.. ఈ సినిమాని రెండు భాగాలుగా మేకర్స్ ప్లాన్ చేయగా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేద్దామని మొదట అనుకున్నారు అయితే ఈ సినిమాని అక్టోబర్ 10 వ తారీఖున విడుదల చేయాలని అనౌన్స్ కూడా చేశారు ఆ తర్వాత రజనీకాంత్ గారి మూవీ పెట్టాయన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది.
దీనితో ఈ రెండు చిత్రాల మధ్యలో భారీ క్లాస్ వస్తుందని భావించి కంగువా మూవీని పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. అయితే ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల పోస్ట్ పోన్ చేసుకుని అదే నెలలో అక్టోబర్ 31 తారీఖున విడుదల చేయాలని ఈ సినిమా మేకర్స్ అనుకుంటున్నారని సమాచారం. మేకర్స్ చెప్పిన దాని ప్రకారం కంగువా మూవీ గ్రాఫిక్స్ ఇంకా పూర్తి చేయలేదని అవి పూర్తి కావడంతో కొంచెం ఎక్కువ టైం పడుతుందని అందుకే మూవీని అక్టోబర్ 10 వ తారీఖున విడుదల చేయడం లేదని మూవీ మేకర్స్ తెలియజేయడం జరిగింది . ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా కంగువ మూవీ పోస్ట్ పోన్ అయ్యే విషయం ఇంకా అధికారికంగా మూవీ టీం వెల్లడించలేదు. కంగువ మూవీ టీం క్లారిటీ ఇస్తే తప్ప ఈ న్యూస్ నిజమని నమ్మడం సాధ్యపడదు. సూర్య నటించిన ఈ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుందని తెలుస్తుంది. ఇందులో హీరో సూర్య ఒక తెగ నాయకుడిగా కనిపిస్తున్నాడు . ఈ మూవీలో బాలీవుడ్ హీరో బాబి డియల్ విలన్ గా నటించడం జరుగుతుంది. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.