hrithik roshan junior ntr movie : చిత్ర పరిశ్రమలో తోపు డాన్సర్స్ అంటే గుర్తొచ్చే వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ ఏదాడి ఆగస్టులో ఈ మూవీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే తాజాగా సినిమాకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.
ఈ మూవీలో హృతిక్ ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేసి ఏకంగా 500 మంది డాన్సర్లను రంగంలోకి దించుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. యసు రాజ్ స్టూడియో లో ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం ఈ సినిమాకు ప్రితము సంగీతం అందిస్తుండగా ఈ సాంగ్ ని బాస్కోమార్టిస్ కొరియోగ్రాఫర్ చేస్తున్నారని అనుకుంటున్నారు.
తమకు తామే పోటి అనేలా చెలరేగే ఇద్దరు డాన్సర్లు ఈసారి కలిసి డాన్స్ చేస్తే థియేటర్లు దద్దరిలాల్సింది గ్యారంటాని. ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటులనే ఈ సాంగ్ కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
hrithik roshan junior ntr movie మరోవైపు ఈ సినిమా తారక్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం కావడంతో మూవీపై భారీ అంచనాలను నెలకొంది. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి తారక్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ రీసెంట్ గానే షూటింగ్ నుంచి తారక్ పిక్స్ లీక్ అయిన విషయం తెలిసిందే.
ఇక RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలానే ఎన్టీఆర్ చేతులో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ ఉన్నాయి. వార్ 2 , తర్వాత దేవర 2, ఎన్టీఆర్ 31, చిత్రాలు చేస్తున్నట్టు సమాచారం.