Pawan కు మూడులక్షల విరాళం అందించిన Hyperaadi : ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధితులకు జబర్దస్త్ నటుడు హైపర్ ఆది తన వంతు సహాయం అందించడం జరిగింది .జబర్దస్త్ సోలో తన కామెడీ పంచలతో తెలుగు ప్రేక్షకుల నుంచి అభినందనలు పొందాడు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడలోని కొన్ని ప్రాంతాలు నీట మునగడం జరిగినది. ఆ సంఘటన మనమందరం చూసాం. ఇప్పటికీ వరద బాధితులకు అండగా సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు చాలామంది విరాళాలు అందజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి . తాజాగా జబర్దస్త్ నటుడు హైపర్ ఆది కూడా తన వంతుగా వరద బాధితులకు ఆర్థిక సహాయం అదే ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది.
ఈ నేపథ్యంలో Hyperaadi ఏపీలోని వరద బాధితులకు విరాళంగా మూడు లక్షల రూపాయలు అందించడం జరిగింది. అందుకు సంబంధించిన చెక్కును స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కి అందజేయడం జరిగింది. ఈ డబ్బును ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంచాయితీలకు అందజేయాలని హైపర్ ఆది Pawan కళ్యాణ్ గారిని కోరడం జరిగింది. ఈ మూడు లక్షల రూపాయల్లో పిఠాపురం నియోజకవర్గంలోని వరద పీడిత గ్రామమైన ఏకే మల్లవరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
అలాగే మిగిలిన రెండు లక్షల రూపాయలు తన సొంత గ్రామమైన పళ్ళపల్లి గ్రామపంచాయతీ కోసం అందజేయమని పవన్ కళ్యాణ్ గారిని హైపర్ ఆది కోరారు ఈ సందర్భంగా హైపర్ ఆది మీడియాతో మాట్లాడారు ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన మరియు వరదల్లో నష్టపోయిన వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల విరాళం ఇచ్చి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి తనవంతుగా 3 లక్షల రూపాయలు ఇచ్చానని జబర్దస్త్ నటుడు హైపర్ ఆది మీడియాతో చెప్పడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం అతలాహుతలమైంది మరియు చాలా లోతట్టు ప్రాంతాలు కూడా జల మయం అయ్యాయి. అందరికీ ఏపీ ప్రభుత్వం తగినంత ఆర్థిక సహాయం చేస్తుంది.. అలాగే బిజినెస్ మాన్ మరియు హీరోలు రాజకీయ నాయకులు చాలామంది ఏపీ ప్రభుత్వానికి విరాళంగా కొన్ని కోట్ల రూపాయలు పంపడం జరుగుతుంది. వీటిని జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయాన్ని అందించడం జరుగుతుంది..
ఇప్పుడిప్పుడే వరదల నుంచి ఆంధ్రప్రదేశ్ కోలు కుంటుంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం కూడా ఇప్పుడిప్పుడే వరద నుంచి కోలుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వరదల వలన ఎక్కువ నష్టపైన నగరం విజయవాడ. అలాగే ఆంధ్రప్రదేశ్లో పాటు తెలంగాణలో కూడా ఖమ్మం నగరం చాలా నష్టపోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా హీరోలు రాజకీయ నాయకులు బిజినెస్మేన్లు అందరూ విరాళం ప్రకటించడం జరిగింది విరాళం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది..
అలాగే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ వరద బాధితులకు తన వంతు సహాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కలిసి ఇవ్వడం జరిగింది. ఇలా కష్టం వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలని మనమందరం కోరుకుందాం.