(coconut )కొబ్బరి నీళ్లు తాగితే ఈ అనారోగ్యాలు దూరం అవుతాయి.ఎండ వేడిని తట్టుకోవడానికి బెస్ట్ రీఫ్రెష్మెంట్ కొబ్బరి నీళ్లు వల్ల ఆ అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వేసవికాలం స్టార్ట్ అయింది ఇప్పటికే బాణుడు బాగా బాగా ఎండలు మొదలయ్యాయి మండే ఎండల వల్ల గొంతు ఆరిపోతుంది. అలసట నిస్సాత్తువా తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి.
కొబ్బరినీరు తాగితే డీహైడ్రేషన్. ఎండ వేడిమి తగ్గడమే కాదు అనేక లాభాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. (coconut )కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది కొబ్బరినీళ్ళల్లో పిండి పదార్థాలు. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి ,మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
కొబ్బరి నీరు కడుపుని శాంత పరుస్తుంది కదలికలను సులభతరం చేస్తుంది మలబద్దకం దూరం చేస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ తో సమర్థవంతంగా పోరాడతాయి.
ఇది మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది (coconut )కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి.
గర్భిణీలు కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు కొబ్బరి నీళ్లలో ఉండే విటమిన్ B9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వేధించే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్లలోని పొటాషియం హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచుతుంది.
షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అపోహలు ఉంటారు. కానీ కొబ్బరి నీళ్ళు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని అధిక కణాలను తొలగిస్తాయి కొబ్బరి నీళ్లలోని మెగ్నీషియం ఇన్సులిన్ ని సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదనంగా ఇది టైప్ టు డయాబెటిస్ ఫ్రీ డయాబెటిస్ లో చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్న మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమ మార్గం గమనించగలరు.