IPL 2025 RR vs MI : రోహిత్ శర్మ రికెల్టన్ హార్థిక్ పాండ్యా సూర్య కుమార్ యాదవ్ వీళ్ళందరూ కలిపి వీళ్ళందరూ కూడా సూపర్ గా బ్యాటింగ్ ఆడారు దీనికి తోడు బుమ్రా వేసిన బౌలింగ్ తో రాజస్థాన్ రాయల్స్ ని ఓడించి ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది ఈ విజయంతోటి ముంబై టీం ప్లే ఆప్స్ కు మరింత దగ్గర అయింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 50 వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ బౌలింగ్ తో అదరకొడుతూ ఘన విజయాన్ని సాధించింది. 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ పై.
నిన్న జరిగిన మ్యాచ్లో మొదటగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసి మంచి ఆరంభాన్ని మొదలుపెట్టింది రిక్కెల్టన్ 38 బంతుల్లో మూడు సిక్స్లు ఏడుపార్లతో 61 పరుగులు చేశాడు దీని తర్వాత రోహిత్ శర్మ 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు దీని తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా సూర్య కుమార్ యాదవ్ ఇద్దరు కలిసి మంచి బ్యాటింగ్ చేశారు సూర్య 48 పరుగులు హార్దిక్ 48 పరుగులు చేశారు. ఇలా బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 217 పరుగులు చేసి రాజస్థాన్ ముందు ఉంచింది.
218 పరుగుల భారీ టార్గెట్ కు రాజస్థాన్ రాయల్స్ దిగింది. ఇంత భారీ స్కోరును సాధించడానికి రాజస్థాన్ రాయల్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది అందులో జైస్వాల్ 13 పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ ఆడ లేకపోయాడు నితీష్ 9 పరుగులు చేశాడు. దుబే 15 పరుగులు చేశాడు కార్తికేయ రెండు పరుగులు చేశాడు ఇలా ఇలా బ్యాటింగ్తో చేస్తూ 16 ఓవర్లకే ఆల్ అవుట్ అయింది రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు చేసిన మొత్తం పరుగులు 117 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 100 పరుగులు తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
IPL 2025 RR vs MI ముంబై విజయంతో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ బౌలింగ్ తోటి బ్యాటింగ్తో అద్భుతమైన ఆట ఆడి రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ తో ముంబై ఇండియన్స్ ఏడవ విజయాన్ని అందుకుంది ప్లే ఆఫ్స్ లో మరింత దగ్గరలోకి వెళ్ళింది ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ వర్ష విజయాలతో ముందుకెళ్తుంది ఈ ఐపీఎల్ సీజన్లో.