Iron లోపం ను ఈ vegetables ద్వారా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. చాలామంది Iron లోపలతో బాధపడేవారు ఇతర అనారోగ్య సమస్యలతో కూడా బాధింప బడతారు ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నవాళ్ల కు రక్తహీనత వీరిని వేధిస్తుంది అలాగే ఐరన్ లోపాన్ని నివారించు కోవడానికి మనకు దొరికే కొన్ని రకాల కూరగాయలు చాలా బాగా పని చేస్తాయని ప్రతి మనిషి శరీరంలో ఐరన్ సరిపడా ఉండడం ఎంతో అవసరమని ఆరోగ్య డాక్టర్లు తెలియజేయడం జరుగుతుంది. మన శరీరంలో ఐరన్ అనేది సరిపడా ఉండాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఈ ఐరన్ లోపాన్ని నివారించు కోవడానికి చాలామంది ట్యాబ్లెట్లు వాడడం జరుగుతుంది ఇలా టాబ్లెట్ వాడటం వలన మన శరీరానికి మంచిది కాదు అందుకే మన ఇంటిలో దొరికే కూరగాయల ద్వారా ఐరన్ లోపాన్ని నివారించుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
ఏ కూరగాయలు Iron లోపని నివారిస్తాయి
ఐరన్ లోపం ఉంటే వ్యక్తులు ముఖ్యంగా నీరసం గాను శక్తిహీనంగానూ ఉంటారు ఐరన్ పుష్యలంగా ఉంటే వారు ఫుల్ ఎనర్జీతో మనకు కనిపించడం జరుగుతుంది. ఇక ఐరన్ పుష్కలంగా ఉండే కొన్ని కూరగాయలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు మరి ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుందామా
బీట్రూట్:
ఐరన్ పుష్కలంగా ఉన్న కూరగాయలలో బీట్రూట్ ఒకటి. బీట్రూట్ ఎర్ర రక్త కణాల అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే బీట్రూట్ మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాల అభివృద్ధికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది. బీట్రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత తగ్గుతుంది ఐరన్ లోపాన్ని ఇది నివారిస్తుంది.
పచ్చి బఠానీలు:
మార్కెట్లో దొరికే పచ్చిబఠానీలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది పచ్చిబఠానీలను మనము ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది వీటితోపాటు రోదనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా పచ్చి బఠాణీలు కాపాడడం జరుగుతుంది.
పాలకూర:
పాలకూర ల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు ఒక కప్పు పాలకూర తింటే 6.4 మిల్లీ గాo ల ఐరన్ మన శరీరానికి అందుతుందని ఆరోగ్య శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఆహారంలో పాలకూరను భాగం చేసుకోండి ఇది మన శరీరానికి పాలకూర అనేది చాలా మంచిది. వీటితోపాటు పాలకూర తినడం వల్ల ఐరన్ కూడా పుష్కలంగా మన శరీరానికి అందుతుంది మనకు అన్ని విధాలుగా చాలా మంచిది.
చిలకడదుంపలు మరియు క్యాబేజ్:
అందరికీ ఇష్టమైన చిలగడదుంపలో కూడా మన శరీరానికి కావలసిన ఐరన్ ను ఇచ్చే పోషకాలు చాలా ఉన్నాయి చిలగడ దుంపలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి క్యాబేజీలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది కూడా మన శరీరంలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది మనం క్రమం తప్పకుండా ఈ కూరగాయలను మన ఆహారంలో భాగంగా తీసుకుంటే కచ్చితంగా మన శరీరంలో ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.