కన్నడ హీరో దర్శన్ మొదటి నుంచి ఏదో ఒక వివాదాలతో నిత్యం .వార్తల నిలుస్తూనే ఉంటాడు ఇప్పుడు దర్శన్ రేణుక స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటుడు .దర్శన కు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని హత్య కేసులో విచారిస్తున్నారు అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి రావడంతో ఇప్పుడు హీరో దర్శన్ మరిన్ని చిక్కుల్లో పడుతున్నారని కన్నడ ఇండస్ట్రీ మాట్లాడుకోవడం ఇప్పుడు సంచలన టాపిక్ గా మారింది.
మరోవైపు కన్నడ హీరో దర్శన్ కుటుంబ సభ్యులంతా హీరో దర్శన్ కు దూరంగా ఉండడంతో ఆయన మేనమామ కూడా దర్శన్ దెబ్బకు వీధిన పడ్డారనే సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. కర్ణాటకలోని చిత్ర దుర్గకు చెందిన రేణుక స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్టు కావడంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హీరో దర్శన్ పై నిరసనలు తారాస్థాయి చేరుతున్నాయి హీరో దర్శన్ మీద హత్య ఆరోపణలు రావడంతో విమర్శలు కూడా చాలా వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు దర్శన్ అరెస్టు కావడంతో పాత ఘటనలో దర్శన్ వల్ల అన్యాయానికి గురైన వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా మీడియం ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అంతేగాకుండా ఇప్పుడు హీరో దర్శన్ మేనమామ కూడా హీరో దర్శన్ పరిస్థితి పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు .రేణుక స్వామి హత్య కేసులో హీరో దర్శన్ పేరు వినిపించడంతో హీరో దర్శన్ సొంత ఊరు అయినా కొడగు జిల్లా పొన్నంపేటలో స్థానికులు కుటుంబ సభ్యులు అందరూ ఉలిక్కిపడడం జరిగింది.
మరోవైపు హీరో దర్శన్ మేనమామ హీరో దర్శన్ గురించి చెబుతూ దర్శన్ మరియు అతని తల్లి తమ కుటుంబాన్ని స్వయంగా ఇబ్బందులకు గురి చేశారని దర్శన్ పుట్టి పెరిగిన ఇంటిని కూల్చివేశారు అని ఈ కేసులో ఇప్పటికీ దర్శన్ తల్లి హీరో దర్శన్ ఇద్దరు ఈ కేసును ఎదుర్కొంటున్నారని ఆయన మేనమామ శ్రీనివాసు గారు గురువారం మీడియాకి తెప్పడం జరిగింది. ఆస్తి విషయంలోమేనమామ తో గొడవ పడిన హీరో దర్శన్ .అతను పుట్టి పెరిగిన పెరిగిన పొన్నంపేటలో ఉన్న తన నివాసం ఉన్న ఇంటిని కూల్చివేశాడని ఆయన మేనమామ హీరో దర్శన్ పై ఆరోపించడం జరిగింది దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డామని కూడా దర్శన్ మేనమామ హీరో దర్శన్ గురించి చెప్పడం జరిగింది.
రీసెంట్ గా ఈ హత్య కేసు గురించి పోలీసు విచారణలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అవి ఏమిటంటే రేణుక స్వామిని కొట్టి చంపింది హీరో దర్శనేనని తెలుస్తుంది. హీరో దర్శన్ రేణుక స్వామిని ఇష్టమైన కొట్టి తర్వాత రేణుక స్వామి మర్మాంగాల మీద తన్ని చిత్రహింసలకు గురి చేశారని కన్నడ పరిశ్రమ మరియు కన్నడ మీడియా లో వార్తలు వస్తున్నాయి. నిజాలు ఇంకా ఎవరికీ సరిగా తెలవదు కానీ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఈ హత్య కేసులో హీరో దర్శన హస్తం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు అని కన్నడ మీడియా తెలియజేస్తుంది. నిజ నిజాలు ఆ దేవుడికే తెలియాలి. అక్కడ న్యాయమూర్తులు చెప్పిన దాని ప్రకారం హీరో దర్శన్ కి మరియు ఈ హత్యలో ఉన్న అందరికీ మూడు నెలలు బెయిల్ ఇవ్వకుండా కష్టపడి లోనే ఉంచడం జరుగుతుందని తెలియజేస్తున్నారు.
ఏం జరుగుతుందో చూడాలి ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో. కానీ హీరో దర్శన్ అభిమానులు మాత్రం తమ హీరో ఏ విధమైన తప్పు చేయలేదని చెబుతున్నారు. చూడాలి ఏం జరగబోతుందో.