అదిరిపోయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్

Written by 24newsway.com

Updated on:

అదిరిపోయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్. దేవర ట్రైలర్ చూస్తూ ఉన్నంతసేపు విజువల్ వండర్ గా మరియు యాక్షన్ తో ప్రతి నిమిషం ఉత్కంఠ భరితంగా ఉంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అలాగే ఇందులో విలన్ గా నటించే సైఫ్ అలీ ఖాన్ గారు కూడా తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఎంత ప్రాముఖ్యత తంతరించుకుంటుందో ఇందులో విలన్ గా నటించిన సైఫాలీ ఖాన్ పాత్ర కూడా అంతే దీటుగా ఉన్నట్టు ఈ ట్రైలర్ చూస్తుంటే మనకు అర్థం అయిపోతుంది.

ఇందులో హీరోయిన్ గా నటించిన జాన్వి కపూర్ ను మాత్రం అంతగా చూపించలేదు. కానీ జాన్వికపూర్ మాత్రం పల్లెటూరు అమ్మాయిలాగా బాగా సెట్ అయింది. ఇందులో శ్రీకాంత్ పాత్ర మరియు ప్రకాష్ రాజ్ పాత్ర కూడా చాలా బలంగా ఉన్నట్లు అనిపించింది. దేవర ట్రైలర్ ప్రతి షార్ట్ ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ముఖ్యంగా యాక్షన్స్ సన్నివేశాలు మాత్రం అదిరిపోయాయి అని చెప్పవచ్చు. దేవర ట్రైలర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఉంది. యాక్షన్స్ అన్వేషన్లో బిజీ ఏం మాత్రం బాగా సెట్ అయిందని చెప్పవచ్చు.

ఇంకా దేవర స్టోరీ విషయానికి వస్తే సముద్రంలో నడిచే షిప్ మీద దాడి చేసి దోచుకునే గ్యాంగ్ గా సైఫ్ అలీ ఖాన్ గ్యాంగ్ కనిపిస్తూ ఉంది. వాళ్లని ఎదుర్కొనే వాడిగా జూనియర్ ఎన్టీఆర్ గారు పాత్ర కనిపిస్తూ ఉంది. అలాగే కొడుకు ఎన్టీఆర్ పాత్ర చాలా పిరికివాడిగా మరియు భయస్తుడుగా కనిపిస్తూ ఉంది. ఎన్టీఆర్ ని ఆటపాటిస్తూ జాన్వి కపూర్ పాత్ర చాలా క్యూట్ గా నటించడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొరటాల శివ గారి డైరెక్షన్ అదిరిపోయింది అని చెప్పవచ్చు. కొరటాల శివ గారు ఈ సినిమాలో ప్రతి షార్ట్ చాలా బాగా తీశారని తెలుస్తుంది. కొరటాల శివ గారు లాస్ట్ గా తీసిన ఆచార్య సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. అందుకే ఈసారి దేవర మూవీ స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది. దేవర మూవీ ఇన్ సైడ్ టాక్ మాత్రం అదిరిపోయింది అని తెలుస్తుంది.ఎన్టీఆర్ గారు ఇవాళ ముంబాయి లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ స్టోరీ మీద చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమా మేకర్స్ కూడా ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.

Read More>>

Leave a Comment