Junior NTR Devara Trailer Release Tomorrow . గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటిస్తున్న రీసెంట్ మూవీ దేవర పార్ట్ 1 . ఈ దేవర మూవీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతుంది .కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబో లో అంత ముందు జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ ఇట్టుగా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తరసన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది జాహ్నవి కపూర్ తొలి తెలుగు సినిమా ఇది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన సైఫ్ ఆలీ ఖాన్ ఈ దేవరా మూవీలో విలన్ గా నటించడం జరుగుతుంది.. సైఫ్ ఆలీ ఖాన్ కూడా తొలి తెలుగు చిత్రం.
ఇప్పటివరకు సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో హీరోగా తప్ప విలన్ గా నటించలేదు. మొదటిసారిగా . సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటించడం మనం చూస్తూ ఉన్నాం. సైఫాలికన్ బాలీవుడ్ లో కొన్ని నెగిటివ్ క్యారెక్టర్ లు చేశాడని పూర్తిస్థాయిలో విలన్ గా నటించలేదు. ఒక్క తానాజీ సినిమాలో మాత్రం అజయ్ దేవగన్ కు విలన్గా నటించి అందులో హీరో అయినా అజయ్ దేవగన్ కన్నా సైఫ్ అలీ ఖాన్ మంచి పేరు తెచ్చుకున్నాడు.
అలాగే Junior NTR ఆర్ఆర్ ఆర్ మూవీ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురు చూడడం జరుగుతుంది.. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో తీసిన త్రిబుల్ ఆర్ మూవీ హిందీ మార్కెట్లకు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ కలక్షన్ సొంతం చేసుకుంది. అందుకే ఎన్టీఆర్ గారు నటిస్తున్న దేవర మూవీ మీద బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి అటు సౌత్ ఇండియాలో ఉన్న ఇటు నార్త్ ఇండియాలోనూ ఎన్టీఆర్ గారు నటించిన దేవర మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి అందులో ఎన్టీఆర్ కి జోడిగా ఈ మూవీలో జాన్వి కపూర్ గారు నటించడం వలన మరియు సైఫ్ అలీ ఖాన్ గారు నటించడం వలన హిందీలో కూడా ఈ సినిమా మీద భారీ అంచనా నెల ఉన్నాయి.
Junior NTR Devara మూవీని ఈనెల అనగా సెప్టెంబర్ 10 వ తేదీన దేవర మూవీ యొక్క ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. రేపు దేవర ట్రైలర్ విడుదల చేస్తున్నామని ఇప్పటికే దేవర టీం ప్రకటించింది దేవర మూవీ ట్రైలర్ రేపు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది అని మేకర్ ఇవ్వాళ తెలియజేయడం జరిగింది ఈ ట్రైలర్ కోసం ఒక పోస్టర్ను కూడా దేవర మూవీ టీం విడుదల చేయడం జరిగింది.
ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారు దేవర మూవీ ప్రమోషన్ కోసం ముంబైలో ఉన్నారు. దేవర మూవీ నుండి ఏదైనా న్యూస్ వచ్చిన వెంటనే వైరల్ గా మారుతుంది అలాగే దేవర మూవీ మీద అంచనాలు కూడా రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ మరియు జాన్వి కపూర్ తో పాటు ప్రకాష్ రాజ్ హీరో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ పై భారీ లెవెల్ లో నిర్మించడం జరుగుతుంది. రేపు దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతాయని ఎన్టీఆర్ అభిమానులు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దేవర మూవీ యొక్క ఇన్ సైడ్ టాక్ మాత్రం దేవర మూవీ అదిరిపోయింది అని వినిపిస్తుంది.