kingdom movie music update : విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ కింగ్ డమ్ ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ను ఫాన్స్ ను ఎంతో ఆకట్టుకుంది అయితే తాజాగా చిత్రం ఒరిజినల్ సౌండ్ రిలీజ్ చేసింది. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ మ్యూజిక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. థియేటర్లో ఈ మూవీ యొక్క మ్యూజిక్ రెస్పాన్స్ మామూలుగా ఉండదు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.
విజయ్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్ డమ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమ్ తిన్న నూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు తాజాగా ఈ మూవీపై ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విడుదల చేశారు. దీనికి ఫాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా రిలీజ్ చేసిన కింగ్ డమ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ నీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సౌండ్ ట్రాక్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది జైలర్ తర్వాత అనిరుద్ రవిచంద్ర ఇచ్చిన బెస్ట్ బిజిఎం ఇదేనంటు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు ఈ మూవీని మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
kingdom movie music update ఇక ఇటీవల వదిలిన టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. అందులో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కింగ్డమ్ మూవీ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎన్టీఆర్ డైలాగ్స్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా గౌతం తిన్ననూరి టీజర్ అద్భుతంగా విజువల్స్ ను క్రియేట్ చేశారు. ఇక టీజర్ చివర్లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ కూడా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది తనదైన స్టైల్ లో డైలాగ్స్ చెప్పడం ఫాన్స్ కి భారీ అంచనాలను పెంచింది. అయితే సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది టీజర్ లో కూడా ఎక్కడ హీరోయిన్ కనబడలేదు. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.