kiran abbavaram new movie : “క” సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం. ఈ హోలీకి “దిల్ రూబా” అనే మూవీ తో వస్తున్నాడు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. హీరో కిరణ్ అబ్బవరం ఈసారి మంచి హిట్టు కోసం యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకొని ఏదో కాన్సెప్ట్ తో రాబోతున్నట్టుగా హింట్ ఇచ్చాడు. అయితే దీని తర్వాత రాబోయే సినిమాలన్నీ భారీ స్కేల్ లో ఉండబోతున్నాయని కిరణ్ అబ్బవరం చెప్తున్నాడు.
లాస్ట్ ఇయర్ దివాళి పండగ వరకు కిరణ్ అబ్బవరం కంటెంట్ పట్టించుకోకుండా ఏడాది మూడు నాలుగు సినిమాలు చేయడం వాటిలో ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవడంతో అతనిపై ట్రోల్స్ వచ్చాయి. కానీ క తర్వాత అంత పూర్తిగా మారిపోయింది కిరణ్ సక్సెస్ ట్రాక్ ఎక్కడమే కాదు మన కెరీర్ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. దాంతో ఒకప్పుడు విమర్శించిన వారే మెచ్చుకోవడం మొదలుపెట్టారు అప్పటినుంచి స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు తాజాగా తన డ్రీం ప్రాజెక్ట్ వివరాలు కిరణ్ షేర్ చేసుకున్నాడు.
దిల్ రుబా మూవీ ప్రమోషన్ లో భాగంగా కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఈ సందర్భంగా తన ఫీచర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ తన లేనప్ లో పెద్ద స్పాన్ ఉన్న కథలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
kiran abbavaram new movie అలానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మూడు భాగాలుగా రానుందని తెలిపాడు. ఒక పెద్ద పిరియాడిక్ మూవీ ఫ్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. దాని మూడు పార్ట్స్ గా ప్లాన్ చేస్తున్నాము. నా కెరిర్ లోనే పెద్ద సినిమా అది లంకె బిందెల కాన్సెప్ట్ తో చాలా పెద్ద స్కేల్ లో ఉంటుంది. పార్ట్ వన్ ప్రొడక్షన్ కి మాకు ఏడాదిన్నర సమయం పడుతుంది. ఈ మూవీని 2027 బిగినింగ్ లో చేశావకాశముంది అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ చాలా పెద్దగా ఉండబోతుంది. అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. లంక బిందెల కాన్సెప్ట్ తో పిరియాడిక్ మూవీ అని చెప్పడం దానిని మూడు భాగాలుగా చేస్తున్నామని చెప్పడం ఫాన్స్ ఎగ్జిట్ అవుతున్నారు.