Kubera Movie Success Meet Highlights

Written by 24newsway.com

Published on:

Kubera Movie Success Meet Highlights :

రీసెంట్ గా ధనుష్ నాగార్జున రష్మిక నటించిన Kubera Movie Success Meet నిన్న గ్రాండ్ గా జరిగింది. కుబేర మూవీ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారు హాజరు కావడం జరిగింది. నిన్న జరిగిన కుబేర మూవీ సక్సెస్ మీట్ కి హీరో నాగార్జున హీరో ధనుష్ హీరోయిన్ రష్మిక తో పాటు చిరంజీవి గారు స్పెషల్ ఎట్రాక్షన్ గా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ధనుష్ గారు ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడం జరిగింది. ఎందుకంటే ధనుష్ తమిళ్ లో స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో ఇది రెండవ సినిమా కానీ తమిళ్ హీరో కాబట్టి తమిళనాడులో ప్రమోషన్స్ పాల్గొనడం సహజం కానీ ధనుష్ తను నటించిన మొదటి తెలుగు సినిమా సార్ మూవీకి కూడా సక్సెస్ మీట్ లో పాల్గొనడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు తాను రెండవ తెలుగు సినిమా అయినా కుబేర మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొనడం కూడా ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రజెంట్ అందరూ పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీస్తున్నారు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే సినిమా ఏ భాష అన్నది ముఖ్యం కాదు మూవీలో కథ దమ్ముంటే ఏ భాష సినిమా అయినా అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో విడుదలవుతుంది సినిమా విజయాన్ని సాధిస్తూ ఉంది. అలాంటి సినిమాలు మన తెలుగులో కూడా ఈ మధ్య చాలానే వస్తున్నాయి. ఈ వరుసలో మాత్రం ముందుగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ గారి గురించి తర్వాత అల్లు అర్జున్ గారి గురించి. ఎందుకంటే ప్రభాస్ గారు నటించిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధిస్తూ సుమారు 1000 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. రీసెంట్గా అల్లు అర్జున్ గారు కూడా పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో 1600 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇండియాలో అత్తయ్య ఈగ వసూలు చేసిన మూడవ సినిమా గా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. సౌత్ ఇండియా వాళ్ళు రికార్డులు క్రియేట్ చేస్తున్నారు గాని హిందీ వాళ్ళు మాత్రం సుమారు 300 కోట్లు వసూలు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు.

Kubera Movie Success Meet విషయానికి వస్తే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకెళ్తుంది.

హీరో ధనుష్ మాట్లాడుతూ :

ఈ సినిమా మీట్ లో ధనుష్ గారు మాట్లాడుతూ ఈ సినిమాలో నటించిన తన అదృష్టమని అలాగే ఈ సినిమాలో తాను చేసిన పాత్రకు మంచి ఆదరణ లభిస్తుందని. నాగార్జున గారితో చేయడం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని అలాగే చిరంజీవి చిన్నప్పటి నుంచి ఒక రోల్ మోడల్ గా తీసుకుంటానని ఈ సందర్భంగా ధనుష్ గారు చెప్పడం జరిగింది. అలాగే తనతో నటించిన రష్మిక కూడా మంచి నటనను కనబరిచిందని అలాగే రష్మిక ఈమధ్యను తాను నటించిన సినిమాలు 1000 కోట్లు 1200 కోట్లు వసూలు చేస్తున్నాయని ధనుష్ గారు చెప్పడం జరిగింది.

నాగార్జున గారు మాట్లాడుతూ:

నాగార్జున గారు మాట్లాడుతూ ఈ కుబేర సినిమా తనకు వండ్రఫుల్ ఎక్స్పీరియన్స్ అని ఇంతవరకు నేను చేసిన సినిమాలు చేసిన క్యారెక్టర్లు ఒకలా ఉంటే ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ కొత్తగా ఉందని ఇటువంటి పాత్రలు చేయడం కూడా వండ్రఫుల్ ఎక్స్పీరియన్స్ అని నాగార్జున గారు తెలియజేశారు. నాగార్జున గారు ఇంకా మాట్లాడుతూ ఈ సినిమా మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక ప్రశ్నను ఒక ప్రెస్ అతను ఒక ప్రశ్న అడిగాడు దానికి దానికి సమాధానంగా నేను ఈ సినిమా నా సినిమా అని చెప్పడం జరిగింది. తాను నీ కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని సినిమా విడుదల ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు సినిమా విడుదలైన తర్వాత నా సినిమా అంటున్నాడు అని నామీద మేమ్స్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరిగింది. మీరందరూ తప్పుగా అనుకుంటున్నారు. నేను అప్పుడు చెప్పింది ఒకలా చెబితే దాన్ని మీరు వేరే లాగా అర్థం చేసుకున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను ఇ శేఖర్ కమ్ముల గారి సినిమా మేము అందరం అందులో నటించిన వాళ్ళం మాత్రమే. ఇది నాగార్జున ధనుష్ రష్మిక సినిమా కాదు ఓన్లీ శేఖర్ కమ్ముల గారి సినిమానే అని క్లియర్ కట్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది. అలాగే ఈ తనతో నటించిన ధనుష్ గారి గురించి నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చూసి తనకు మతి పోయిందని అంతలా యాక్టింగ్ చేయడం చాలా గొప్ప విషయమని ఇలా యాక్టింగ్ చేయడం ధనుష్ కు సర్వసాధారణమని అందుకే ధనుష్ కు నాలుగు నేషనల్ అవార్డ్స్ వచ్చాయని ఈ సందర్భంగా నాగార్జున గారు చెప్పడం జరిగింది. అలాగే నాగార్జున గారు రష్మిక గురించి మాట్లాడుతూ రష్మిక నీకు నేషనల్ ట్రస్ట్ అనే టాగు ఎప్పుడు వచ్చింది అని రష్మికను అడగడం రష్మిక పుష్ప సినిమా తర్వాత నుంచి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత నాగార్జున గారు ఇప్పటినుంచి నా క్రష్ కూడా నువ్వే అని అనడం తో అందరూ చప్పట్లు కొట్టుకుంటూ నవ్వడం జరిగింది. నాగార్జున గారి చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ చిరంజీవి గారు మన తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. చిరంజీవి గారు ఈ ఫంక్షన్ కి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని తన ఆప్తమిత్రుడు చిరంజీవి గారని చెప్పడం జరిగింది

Read More

🔴Related Post