lavanya tripathi latest movie గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి…హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పరిచయం అయింది. తన తొలి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల అందరితోనూ లావణ్య త్రిపాఠి నటించింది ఇక మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు మిస్టర్. అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరూ జంటగా నటించారు.
ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తన ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్ళింది. 2023 సంవత్సరంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు వరుణ్ తన సినిమాలు తో బిజీగా మారాడు వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.
lavanya tripathi latest movie : ఆ మధ్య మిస్ పర్ఫెక్ట్ అని వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయి మంచి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో సినిమాకు ఇప్పటివరకు ప్రకటించలేదు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తుంది. దీనిలో భాగంగానే పెళ్లయిన ఏడాది తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించింది.
సతి లీలావతి అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావడానికి మెగా కూడా సిద్ధమవుతుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్లు లావణ్య త్రిపాఠి తెలియజేశారు దీనికి సంబంధించిన పోస్ట్ ను లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ సినిమాల్లో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తుండగా. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు సమ్మర్ తర్వాత ఈ మూవీని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.