Telangana వరద బాధితులకు Mahesh Babu సహాయం

Written by 24newsway.com

Published on:

Telangana వరద బాధితుల కు Mahesh Babu సహాయం: టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు గారు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది . ఈ మధ్య తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం చాలా నష్టపోయింది. తెలంగాణ వరద బాధితుల సహాయార్థం చాలామంది సెలబ్రిటీలు బిజినెస్ మాన్లు మరియు రాజకీయ నాయకులు వాళ్లకి తగినంత సహాయం చేయడం జరిగింది.

అందులో భాగంగానే Mahesh Babu గారు తెలంగాణ వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన 50 లక్షల చెక్కును Telangana సీఎం రేవంత్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది .దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి అందరూ మహేష్ బాబు గారి చేసిన 50 లక్షల సహాయం కన్నా మహేష్ బాబు గారిని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఎందుకంటే మహేష్ బాబు గారు పొడవాటి జుట్టు తో గుబురు గడ్డంతో మహేష్ బాబు గారి న్యూ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది తన తదుపరి చిత్రం SSMB 29 లో ఈ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తుంది.

Mahesh Babu గారు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి గారు కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా సుమారు 1000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమా నిర్మాతలుగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన కే ఎల్ నారాయణ గారితో పాటు హాలీవుడ్ బాడా నిర్మాణ సంస్థ తో నిర్మిస్తారని సమాచారం.

అందుకే సినిమా షూటింగ్ కూడా ఆలస్యం అవుతుందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబుని ఇంతవరకు ఎవరు చూడని విధంగా రాజమౌళి గారు చూపించడం జరుగుతుంది. రాజమౌళి తండ్రి గారు అయినా విజయేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాకి కథ అందించడం జరుగుతుంది.. విజయేంద్ర ప్రసాద్ గారు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ గురించి ఒక విషయం చెప్పడం జరిగింది.

ఈ మూవీ ఒక నవరా ఆధారంగా యాక్షన్ అడ్వెంచర్ గా ఉండబోతుందని సమాచారం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి మహేష్ బాబు గారి అభిమానుల తో పాటు ఇండియా అభిమానులు ఈ మూవీ కోసం ఎదురు చూడడం జరుగుతుంది. చూడాలి మహేష్ బాబు గారి ని రాజమౌళి గారు ఏ రేంజ్ లో చూపించి అందరిని ఆశ్చర్యపరుస్తాడు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందే ఈ మూవీ గురించి రాజమౌళి గారు ప్రెస్ మీట్ పెడతారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆ ప్రెస్ మీట్ లో మూవీ టైటిల్ తో పాటు మహేష్ బాబు గారి లుక్కు ను కూడా విడుదల చేస్తారని సమాచారం చూడాలి ఈ మూవీ గురించి ఇంకా ఎంత సమాచారం బయటికి వస్తాయో.

Read More

Leave a Comment