mahesh babu rajamouli ssmb 29 : సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకుడు రాజమౌళి కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ కోసం భారతదేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంది. రాజమౌళి తీసిన RRR మూవీ తర్వాత తీస్తున్న సినిమా ఇదే. రాజమౌళి గారు ఇప్పటివరకు ప్యాన్ ఇండియా రేంజ్ లో మూవీస్ తీశాడు. ఇప్పుడు రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ పై గురి పెట్టారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ లో జరుగుతున్న ఈ కథ. ఉంటుందని రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రీ రికార్డింగ్ పనులు మొదలుపెట్టారని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ సీన్ లీక్ అయింది బెంగళూరు అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సీన్లో మహేష్ బాబు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో విలన్లు అతని కొట్టడం మహేష్ మోకాళ్లపై కూర్చోవడం. వంటివి దర్శనం ఇచ్చాయి. ఈ వీడియోలో కన్నడ హీరో పృథ్వీరాజ్ సైతం ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని సీన్ ను ఇలా లీక్ చేయడంపై మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పై చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు.
mahesh babu rajamouli ssmb 29 మహేష్ బాబు రాజమౌళి తీస్తున్న మూవీ లో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ నెగిటివ్ రోల్ లో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ సినిమాలో రెండవ హీరోయిన్ చెల్సియా ఇస్లెన్ ఈ మూవీ కోసం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ హీరోయిన్ పై స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారని సమాచారం. ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో రాజమౌళి తీయబోతున్నాడు. సౌత్ ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా కోసం హీరో మహేష్ బాబు తన లుక్స్ మొత్తం మార్చుకున్నారు. ఇటీవలే మహేష్ బాబు జిమ్ లో ఉన్న వీడియో ఒకటి బయటకు రావడం జరిగింది. ఈ వీడియో చూసి అభిమానులు చాలా ఆనందిస్తున్నారు. సింహం మూవీ కోసం సిద్ధమవుతుందని మహేష్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు.