జర్మనీలో స్టార్ట్ కాబోతున్న Mahesh Rajamouli’s movie : తెలుగులో టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి గారు త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై చాలా రూమర్స్ చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి తాజాగా మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.
అదేమిటంటే Mahesh Rajamouli’s movie గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఈ సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ అవుతుందని అలాగే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ జర్మనీలో జరగబోతుందని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.. అలాగే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొనే నటినటులు అందరికీ తొందరలోనే వర్క్ షాప్ నిర్వహించబడుతుందని తెలుస్తుంది. ఈ వర్క్ షాప్ లో మహేష్ బాబు గారు కూడా పాల్గొంటారని కూడా తెలుస్తుంది.
మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో మహేష్ బాబు గారికి హీరోయిన్గా ఇండోనేషియ లో ప్రముఖ నటి చెల్సియా ఇస్లాం ఈ సినిమాలో మహేష్ బాబు గారికి జోడిగా నటిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా స్టోరీ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఈ మూవీ జేమ్స్ బాండ్ మూవీ లాగా ఉంటుందని చెబుతుంటే రాజమౌళి తండ్రి వన్ ఇయర్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మహేష్ బాబు గారి సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని చెప్పడం జరిగింది.
అప్పటినుంచి అందరూ రాజమౌళి మహేష్ బాబు గారి సినిమా ఆఫ్రికా నేపథ్యంలో ఉంటుందని బాగా ప్రచారం చేయడం జరిగింది. అది ఎంతవరకు నిజమో ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ మహేష్ బాబు గారు గాని రాజమౌళి గారు గాని ఇవ్వలేదు. రీసెంట్గా విజయేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఈ సినిమా స్టోరీ గురించి ఒక హింట్ ఇచ్చారు. అదేమిటంటే తనకు రాజమౌళి గారికి దక్షిణాఫ్రికా నవలా రచయిత వెల్బర్ కు పెద్ద అభిమానులం అని చెప్పడం జరిగింది అలాగే ఆయన పుస్తకాల ఆధారంగానే మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా స్టోరీని రాశాను అంటూ చెప్పుకొచ్చాడు కాబట్టి రాజమౌళి మహేష్ బాబు సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
అయితే రీసెంట్గా ఈ సినిమా గురించి ఒక న్యూస్ వచ్చింది అదేమిటంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే రాజమౌళి గారు మహేష్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా గురించి చెప్పబోతున్నారని టాక్. అ ప్రెస్ మీట్ కూడా ఈ సంవత్సరం చివర్లోనే ఉంటుందని తెలుస్తుంది. చూడాలి మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా స్టార్ట్ అయ్యే లోపు ఇంకా ఎన్ని రూమర్స్ వస్తాయో తెలవదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పవచ్చు రాజమౌళి గారి మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చే సినిమా హాల్లో వరల్డ్ మన తెలుగు లాంగ్వేజ్ వైపు చూసే విధంగా ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా ప్రతిష్ట 100 ఎట్లు పెరిగే విధంగా ఉంటుందని మనం కచ్చితంగా చెప్పుకోవచ్చు.