Mammootty కి తీవ్ర అనారోగ్యం ఆసుపత్రికి తరలింపు

Written by 24newsway.com

Published on:

మలయాళ సూపర్ స్టార్ Mammootty కి తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇది మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడ్డ సంఘటన. Mammootty అభిమానులు మాత్రం తమ హీరోకి ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా మమ్ముట్టి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా శబరిమల వెళ్ళినప్పుడు తన ప్రాణ స్నేహితుడు మమ్ముట్టి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అప్పుడు ఈ వార్త బయటకి తెలిసి చాలా పెద్ద గొడవలు కూడా అయ్యాయి. అప్పుడు మోహన్లాల్ కల్పించుకొని మా ఫ్రెండ్ కోసం నేను పూజ చేయించాను తప్ప మమ్ముట్టి ఆరోగ్యానికి ఏ విధమైన డోకా లేదని వీడియో సందేశం ద్వారా తెలియజేయడం జరిగింది. అప్పుడు అందరూ ఆందోళనలో తగ్గించడం జరిగింది.

గత కొంతకాలంగా Mammootty క్యాన్సర్ తో బాధపడుతున్నారని అందుకే సినిమాలో కూడా చాలా తగ్గించాడని ప్రచారం కూడా మలయాళం ఇండస్ట్రీలో జరుగుతూ ఉంది. ఈ వార్తలను ఖండిస్తూ మమ్ముట్టి ప్రాణ స్నేహితుడైన రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటస్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మమ్ముట్టి కి క్యాన్సర్ ఉన్నది అని వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆయన తెలియజేయడం కూడా జరిగింది. అలాగే మమ్ముట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్నారని ఆ ఆరోగ్య సమస్యలు అంత పెద్ద ఆరోగ్య సమస్యలు కావని తెలియజేయడం జరిగింది. అలాగే మమ్ముట్టి తొందరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తారని అతను తెలియజేయడం జరిగింది.

మమ్ముట్టికి క్యాన్సర్ అని వస్తున్న వార్తలు అసత్యాలని అనవసరంగా అసత్యాలను ప్రచారం చేయడం మంచిది కాదని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే తొందర్లోనే మోహన్ లాల్ మమ్ముట్టి కాంబినేషన్లో ఒక భారీ చిత్రం రూపొంద పోతుందని ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే మమ్ముట్టి ఫ్యాన్స్ ఏ విధమైన ఆందోళనకు గురి కావద్దని మీ హీరో త్వరగా కోలుకొని మీ ముందుకి వస్తాడని ఆయన తెలియజేయడం జరిగింది.

Mammootty విషయానికి వస్తే మమ్ముట్టి ఈ మధ్యనే తెలుగు సినిమాలలో కూడా వరుసగా నటించడం జరుగుతుంది. మమ్ముట్టి మొదటి తెలుగు స్ట్రైట్ ఫిలిం యాత్ర మూవీ. ఈ మూవీ ద్వారా మమ్ముట్టి మొదటి స్ట్రైట్ తెలుగు ఫిలిం గా చెప్పవచ్చు. ఈ యాత్ర సినిమా రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించడం జరిగింది ఈ సినిమాలో మమ్ముట్టి గారి యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి మమ్ముట్టి గారిని ఈ సినిమాలో చూస్తుంటే అచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గారిని చూస్తున్నట్టే ఉందని చాలామంది చెప్పడం జరిగింది. ఈ యాత్ర సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సాధించింది. అలాగే మమ్ముట్టి గారు తర్వాత యాత్ర 2 సినిమాతో మళ్లీ తెలుగు సినిమాలో నటించడం జరిగింది. ఈ మూవీ కూడా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను మమ్ముట్టి గారు పలకరించడం జరిగింది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా మమ్ముట్టి గారి యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత తెలుగు సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చి వరుసగా మలయాళ సినిమాలు చేయడం జరిగింది. అక్కడ Mammootty గారి నటించిన సినిమాలు వరుస వేయాలని సాధించి ఇంత వయసులో కూడా కుర్రాలకు పోటీ ఇస్తున్నాడు మమ్ముట్టి గారు. ఒక విధంగా చెప్పాలంటే మోహన్ లాల్ గారు మమ్ముట్టి గారు ఈ తరం హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. వాళ్లు వరుసగా సినిమాలు చేస్తూ సుమారు మినిమం ఒక్కొక్క సినిమా 100 కోట్లు వసూలు చేస్తుంది. మమ్ముట్టి గారు మోహన్ లాల్ గారు గత హరిదారు సంవత్సరాల నుంచి వరుసగా బ్లాక్ బాస్టర్లు అందుకుంటూ మినిమం 100 కోట్లు వసూలు చేస్తూ మలయాళ ఇండస్ట్రీని ఒక రేంజ్ లో పైకి తీస్కరావడం జరిగింది. అలాగే అన్ని ఇండస్ట్రీలో వాళ్లు మాలయాల ఇండస్ట్రీ లో వచ్చే సినిమాలను చూసి భయపడే విధంగా వసూలు సాధించడం జరుగుతుంది. ఏది ఏమైనా గానీ మమ్ముట్టి గారు త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం

Read More

🔴Related Post