వరుస ప్లాప్స్ లో ఉన్న Mega Heroes

Written by 24newsway.com

Published on:

వరుస ప్లాప్స్ లో ఉన్న Mega Heroes . ఈ విషయం తెలిసి మెగా అభిమానులు చాలా బాధపడటం జరుగుతుంది.. ఎందుకంటే వేరే హీరోలు బ్లాక్ బాస్టర్ హిట్స్ సాధిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. కానీ మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్స్ అవడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నా రూ.

ఈ మధ్యన Mega Heroes టైం బాగా లేనట్టుంది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు మరియు బయ్యర్లు ప్రేక్షకులు మెగా హీరోలు అంటేనే భయపడి పోతున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే మేఘ హీరోలు నటించిన సినిమాలు వరుస పెట్టి ప్లాప్ కావడం వల్ల ఈ సినిమాలను కొనాలంటే డిస్ట్రిబ్యూటర్లు సంకోచించడం జరుగుతుంది . మెగా హీరోలు నటించిన సినిమాను కొనాలా వద్దా అని డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు అనుకోవడం గమనార్ధం. ఈ మధ్యన నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు మెగా సినిమా ఏది పట్టుకున్న గాని భయంకరమైన షాక్ కొడుతుంది.

చిరంజీవి గారి నటించిన భోళా శంకర నుంచి రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ వరకు Mega Heroes  నటించిన ఏ సినిమా కూడా విజయాన్ని సాధించలేకపోయింది. అసలు ఈ పరిస్థితి ఎప్పటినుంచి మొదలైనది అంటే మెగా హీరోలు అయిన పవన్ కళ్యాణ్ సాయి ధర్మ తేజ్ నటించిన బ్రో సినిమా నుండి మెగా సినిమా నుండి డిస్ట్రిబ్యూషన్ చేసే వారికి మరియు నిర్మాతలకు కష్టాలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. వీటితోపాటు చిరంజీవి గారు చివరి సినిమా అయినా బోలా శంకర్ సినిమా అజిత్ గారు ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం తీసిన సినిమాకి రీమేక్ ఆ సినిమాను భయంకరమైన ప్లాపులు ఇచ్చే దర్శకుడుగా పేరుపొందిన డైరెక్టర్ చేతిలో పెట్టడం చిరంజీవి గారు చేసిన మరో తప్పు చిరంజీవి గారి నటించిన బోళాశంకర్ సినిమా భారీ డిజాస్టర్ గా మొదటి ఆటతోనే నిరూపించుకుంది. ఈ సినిమాను కొన్న వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలవనీ పరిస్థితి. అంత ఘోరమైన డిజాస్టర్ మూవీ బోలా శంకర్.

ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ రీసెంట్గా నటించిన సినిమాలన్నీ భారీ పరాజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. వరుణ్ తేజ్ చివరగా నటించిన సినిమా మట్కా ఈ సినిమా మొదటి ఆట నుంచే ప్లాప్ టాక్  సొంతం చేసుకోవడం జరిగింది. ఐదో రోజు థియేటర్లలో రూపాయి కూడా రాలేదు. అంత ఘోరంగా పరాజయం పాలైంది ఈ సినిమా వరుణ్ తేజ్ సినిమా లైఫ్ ఇప్పుడు డేంజర్ లో ఉన్నదని చెప్పవచ్చు ఎందుకంటే వరుణ్ తేజ్ ప్రస్తుత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించడం జరుగుతుంది ఈ సినిమా కూడా వరుణ్ తేజ్ కి ప్లాప్ ఇచ్చినచో మార్కెట్ లేని మెగా హీరోగా వరుణ్ తేజ్ పేరు వార్తల్లో నిలుస్తుంది ఇంకా ఇంకో మెగా హీరో అయిన వైష్ణవ తేజ్ ఆదికేశవ రూపంలో భారీ పరాజయాన్ని అందుకోవడం జరిగింది.

మెగా హీరోలో అందరికన్నా బెటర్ పొజిషన్లో ఉన్నది ఎవరా అంటే రామ్ చరణ్ గారు  RRR మూవీతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన రామ్ చరణ్ గారు తర్వాత నటించిన గేమ్ చేంజర్ మూవీ భారీ పరాజయాన్ని పొంది రామ్ చరణ్ గారికి ఒక మచ్చగా మిగిలిపోయింది. ఇంకో విషయం ఏమిటంటే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ లో మంచి నటన ఘనపరచడం జరిగింది. అసలు రాంచరణ్ గారి నటన వల్లనే ఆ మాత్రం వసూళ్లైన వచ్చాయి. గేమ్ చేంజ్ సినిమా ప్లాప్ అయిన గాని రామ్ చరణ్ నటనకు మాత్రం అందరు ఫిదా అయ్యారు. గేమ్ చేంజర్ వల్ల రాంచరణ్ గారికి ఏ విధమైన చెడ్డ పేరు రాలేదు . కానీ శంకర్ గారికి మాత్రం బీభత్సమైన ట్రోల్స్ నడిచాయి .

ఇప్పటినుంచైనా మెగా హీరోలు స్టోరీ సెలక్షన్ లో జాగ్రత్త వహిస్తూ ఘన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

🔴Related Post