megastar chiranjeevi award : యూకే పార్లమెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం దక్కింది తాజాగా బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందజేశారు సినీ రంగా అభివృద్ధికి చేసిన కృషి సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తుగా బ్రిటన్ చట్టసభలో ఆయనను ఘనంగా సత్కరించారు. దీంతో మెగా ఫాన్స్ అందరు ఎంతగానో సంతోషించారు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కొందరు వ్యక్తులు ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేయడంపై చిరంజీవి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం చేయడం. తెలిసిన సంగతే బ్రిడ్జ్ ఇండియా సంస్థ బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఆయన ఘనంగా సత్కరించింది నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగ అభివృద్ధికైనా చేసిన కృషి సేవా కార్యక్రమాలు చేసిన చిరంజీవి గారికి గుర్తింపుగా ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు. అయితే చిరు లండన్ ట్రిప్ నీ కొందరు వ్యక్తులు ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారు ఈ విషయం చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
మై డియర్ ఫ్యాన్స్ యూకే ల నన్ను కలవాలని మీరు చూపించే ప్రేమ నన్ను ఎంతగానో కదిలించింది అయితే కొందరు వ్యక్తులు ఫ్యాన్ మీటింగ్స్ అని డబ్బులు వసూలు చేస్తున్నారని నాకు సమాచారం వచ్చింది ఇలాంటి ప్రవర్తనను నేను ఎప్పుడు ఖండిస్తాను ఎవరైనా డబ్బులు వసూలు చేస్తుంటే వెంటనే వాటిని తిరిగి ఇచ్చేయండి దయచేసి జాగ్రత్తగా ఉండండి నేను ఎక్కడ ఎటువంటి చర్యలకు మద్దతు ఇవ్వనని తెలుసుకోండి మన మధ్య ఉన్న ప్రేమ బంధం ఎంతో గొప్పది వేల కట్టలేనిది మన మధ్య ఉండే బంధం జెన్యూన్ గా ఎలాంటి స్వలాభార్జనకు గురికాకుండా ఉంచుదాం అని చిరంజీవి ఎక్స్ లో పోస్టు పెట్టారు.
megastar chiranjeevi award అంతకుముందు యూకే పార్లమెంట్లో తన దక్కిన గౌరవం ఆయనకిచ్చిన గౌరవాన్ని బట్టి ఆయన ఎమోషనల్ ట్విట్ పెట్టారు. ఈ ఆనందాన్ని మాటలు చెప్పలేనని ఈ గౌరవం తనని మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రేరేపిస్తుందని అన్నారు. ప్రేమ అభిమానాలను చూపించే అద్భుతమైన అభిమానులు రక్తదాతలు నా సినీ కుటుంబం శ్రేయోభిలాషులు మిత్రులు నా కుటుంబ సభ్యులు ఇలా అందరూ నా ప్రయాణంలో ఎంతగానో సహకరించారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అని చిరు పోస్ట్ పెట్టారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించిన రిటన్ పార్లమెంట్ సభ్యులకు బ్రిడ్జ్ ఇండియా సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు.
ఇంకా సినిమాలు విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నారు ఈ మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కృష్ణన్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు చిరంజీవి గారు. ఈ మూవీని సైన్ స్క్రీన్ బ్యానర్లు రూపొంది ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.