Minister Konda Surekha ను హెచ్చరించిన Megastar Chiranjeevi :
Minister Konda Surekha గారు కేటీఆర్ ని విమర్శించడం లో భాగంగా సమంత నాగచైతన్య విడాకుల పైన కూడా సంచలనం వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి కొండా సురేఖ సమంత నాగచైతన్య విడాకులకు మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ గారు కారణమని చెప్పడం జరిగింది మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో మంత్రి కొండ సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనితో అటు రాజకీయాల్లోనూ సినిమా ఇండస్ట్రీలోనూ మరియు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొండ సురేఖకు దారుణమైన వ్యతిరేకత ఎదురవుతుంది.
ఒక విధంగా చెప్పాలంటే Minister Konda Surekha గారు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే లేపాయి అని చెప్పవచ్చు. కొండ సురేఖ గారు కేటీఆర్ ను విమర్శించడం లో భాగంగా నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చి వేయకుండా ఉండాలంటే సామంతను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ గారు నాగార్జున గారిని అడిగారని మంత్రి కొండా సురేఖ గారు సంచలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అలాగే కొండా సురేఖ గారు ఇంకా మాట్లాడుతూ కేటీఆర్ గారు అడిగిన తర్వాత నాగార్జున గారు నాగచైతన్య గారు సమంతాను కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని బలవంతం చేయగా దానికి సమంతా గారు ఒప్పుకోకపోవడంతో నాగార్జున గారు సమంతా గారితో చెప్పిన పని చేయట్లేదు కాబట్టి నాగచైతన్య విడాకులు ఇవ్వవలసిందిగా సమంత గారిని కోరడం జరిగింది అని అదే విషయమై నాగార్జున కి సమంత కి నాగచైతన్య మధ్య చాలా పెద్ద గొడవ జరిగి అది విడాకులకు దారి తీసింది అని కొండా సురేఖ గారు బహిరంగంగానే మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది..
దీనికి బదులుగా అక్కినేని ఫ్యామిలీ చాలా సీరియస్ గా కొండా సురేఖకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. నాగార్జున గారు స్పందిస్తూ కొండా సురేఖ గారిని అంత పెద్ద పదవిలో ఉంటూ మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా కొండ సురేఖ గారిని నాగార్జున గారు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.. నాగార్జునతో పాటు అమల గారు కూడా చాలా ఘాటుగా స్పందించడం జరిగింది.. అలాగే నాగచైతన్య కూడా విడాకులు అనేది చాలా బాధాకరమైన విషయం నేను సమంత పరస్పరంగీకరణ తోనే విడాకులు తీసుకోవడం జరిగింది అలాగే మీరు మీ రాజకీయాల కోసం మా కుటుంబాల జోలికి గాని మా జోలికి గాని రావద్దు అని నాగచైతన్య కొండ సురేఖ గారికి సీరియస్ గా చెప్పడం జరిగింది. వీరితోపాటు సమంతా కూడా చాలా సీరియస్ గా విడాకులు అనేది మా వ్యక్తిగత విషయం మీ రాజకీయాల కోసం మమ్మలను రోడ్డు మీదకు దయచేసి లాగవద్దు అని అలాగే నేను రాజకీయాలకి చాలా దూరంగా ఉంటానని సమంత గారు కొండా సురేఖ గారికి చెప్పడం జరిగింది.
అలాగే వీరితో పాటు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొండా సురేఖ గారి మీద కౌంటర్ ఎటాక్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఈ విషయం మీద న్యాచురల్ స్టార్ నాని గారు మాట్లాడడం జరిగింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది.. అలాగే మాజీ మంత్రి రోజా కూడా స్పందించడం జరిగింది. అలాగే తమిళ్ హీరోయిన్ ఖుష్బూ స్పందించడం జరిగింది.
ఈ విషయం మీద ఘాటుగా స్పందించిన Megastar Chiranjeevi
రీసెంట్గా Megastar Chiranjeevi గారు కూడా కొండ సురేఖ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు ఈ విషయం మీద స్పందిస్తూ తన సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ గారిని ఉద్దేశిస్తూ గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డాను అని చిరంజీవి గారు పేర్కొనడం జరిగింది. ఆ మహిళా మంత్రి వార్తల్లో నిలిచేందుకు సెలబ్రెటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని చిరంజీవి గారు తన సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సినిమా పరిశ్రమ సభ్యులపై ఇటువంటి మాటలను ఎవరైనా మాట్లాడితే చిత్ర పరిశ్రమ స్పందించి ఏకతాటిపైన వ్యతిరేకిస్తామని చిరంజీవి గారు తన పోస్టులో పేర్కొనడం జరిగింది రాజకీయాలకు సంబంధం లేని మహిళలను రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటని ఇది తప్పని చిరంజీవి గారు చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది .
ఇంకా ఈ విషయం మీద కొండా సురేఖ గారు ఇవాళ మీడియా తో మాట్లాడుతూ కొండా సురేఖ గారు సమంత గారికి క్షమాపణలు చెప్పడం జరిగింది. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ గారిని వదిలే ప్రసక్తి లేదని చెప్పడం గమనార్ధం.