morning walk benefits

Written by 24newsway.com

Published on:

morning walk benefits : రోజు నడవడం వల్ల ఎన్ని లాభాలు తెలుసా. ప్రతిరోజు 60 నిమిషాలు నడవడం వలన చాలా అనారోగ్య సమస్యలను చెక్ పెట్టవచ్చు. డాక్టర్లు కూడా కొన్ని అనారోగ్య సమస్యలకు నడక ఉత్తమమైన మార్గమని కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రోజుకి 8, అడుగుల నుంచి పదివేల అడుగులు నడవడం వలన చాలా వరకు అనారోగ్య సమస్యల కు చెక్ పెట్టవచ్చు. ఇలా రోజు ఇన్ని అడుగులు నడవడం వలన షుగర్ రాకుండా చూసుకోవచ్చు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఏమిటంటే నడిస్తే మంచిది అన్నారుగా అని ఎక్కువ శాతం నడుస్తూ ఉంటే సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెప్పడం జరుగుతుంది.

మనకు నడక చాలా మంచిదే గాని ఏదైనా అతిగా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుచేత డాక్టర్లు తమ ఆరోగ్య సమస్యను బట్టి ఎన్ని అడుగులు నడవమంటారో అన్ని అడుగులు నడవాలి. ప్లే స్టోర్లో నడకకు సంబంధించిన యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. నడక అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఎందుకంటే వారి వారి వయసును బట్టి ఆరోగ్యాన్ని బట్టి డాక్టర్లు నడవమని చెప్పడం జరుగుతుంది. కొంతమంది నడక వారం రోజులు స్టార్ట్ చేసి తర్వాత కాళ్లు నొప్పులు వేస్తున్నాయని చెప్పి నడక ఆపడం జరుగుతుంది. కానీ అలా చేయొద్దు ఎందుకంటే నడక స్టార్ట్ చేసిన కొన్ని రోజుల వరకు కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు రావడం సహజం. కాళ్ల నొప్పులు లేస్తున్నాయని నడవడం ఆపవద్దు. ఎందుకంటే కొన్ని రోజులు నడిచిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. అప్పుడు మీకు ఏ విధమైన కాళ్ల నొప్పుల కీళ్ల నొప్పుల ప్రాబ్లమ్స్ ఉండవు.

Disadvantages of morning walk :

అలాగే మన శరీర ఆరోగ్య స్థితిని బట్టి డవాలని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. కొత్తగా నడక స్టార్ట్ చేసిన వాళ్లు రోజుకి 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు నడుస్తే మంచిదని వైద్యులు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నడక ఎక్కువ సేపు నడిచిన గాని దాని ప్రభావం కాలు యొక్క కీళ్ల మీద పడడం జరుగుతుంది. అలాగే వయసు ఎక్కువగా ఉన్నవాళ్లు అతిగా నడవడం వలన శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే నడక అనేది మంచి విషయమే గాని అతిగా నడిచినచో కోపం చిరాకు అనే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏ వయసులో ఎంత నడవాలో అంతే నడుస్తే శరీరానికి వయస్సుకి మంచిది. ఏదైనా తమ పరిమితికి తగ్గట్టే చేయాలని వైద్యులు సూచించడం జరుగుతుంది.

Read More

🔴Related Post