morning walk benefits in telugu : నడక అనేది ఒక సహజ చర్య ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఈ వ్యాయామం చేయవచ్చు. నడక అనేది ఒక ఏరోబిక్ చర్య శరీరం దిగువభాగంలోని అనేక కండరాలు ఇందులో భాగమవుతాయి. నడక వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ సాధారణం కంటే ఎక్కువ వేగంగా ఎక్కువ దూరం నడవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
morning walk benefits in telugu :వాకింగ్ చేయడం వల్ల కలిగే 7 ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
గుండెకు మంచిది నడక వల్ల గుండె సంబందించిన వ్యాధు లు వచ్చే ముప్పు తగ్గుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వేగంగా నడవడం వల్ల గుండెకు శ్వాస వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది.ఎముకలు బలపడతాయి. నడవడం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టంగా మారుతాయి. ఎముకలు పేలుసుగా మారడానికి నడకతో నివారించవచ్చు.
కండరాలు పటిష్టం అవుతాయి రోజు నడిస్తే శరీరంలోని కండరాలు బలంగా మారుతాయి నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. శరీరానికి సరైన ఆకృతిని కండరాలను ఆరోగ్యంగా మార్చుతుంది.
కేలరీలు తగ్గుతాయి బరువు తగ్గించుకోవడానికి నడక మంచి మార్గం. నడక వల్ల శక్తి ఖర్చు అవుతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు ఉదయం పూట వాకింగ్ చేస్తే ఆకలిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
ఇన్సులిన్ నియంత్రణ. నడక వల్ల శరీరంలో చక్కర స్థాయిలో అదుపులో ఉంటాయని అనేక అధ్యయనాలో తేలింది. నడక వల్ల కొవ్వు పేరుకోదు గుండె జబ్బులు డయాబెటిస్ కాలేయ వ్యాధులకు కొవ్వు పేర్కొవడమే కారణం. ఇన్సులిన్ శరీరం స్పందించే తీరుని కూడా నడక మెరుగుపరుస్తుంది.
మానసిక ఒత్తిడి మాయం. నడక కేవలం శరీర దారుడ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాని కూడా మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ విషయంలో నడక అనేది ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది రోజు వాకింగ్ చేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. మానసిక స్థితి కూడా బాగుంటుంది.
విటమిన్ డి ని మెరుగుపరుస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో నడవడం వల్ల శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి, శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆనకట పక్కన నడవడం వల్ల ఐ జి ఏ అనే యాంటీ బాడీ లు పెరుగుతాయి. ఈ యాంటీ బాడీలా వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. లాలాజలం ఉత్పత్తిలో ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.