ms dhoni and sandeep reddy vanga update

Written by 24 News Way

Published on:

ms dhoni and sandeep reddy vanga update : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి యానిమల్ మూవీ తో బ్లాక్ బాస్టర్ తీశాడు. అందరికి తెలిసిన విషయమే. రణబీర్ కపూర్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అందించారు. ఇప్పుడు హీరో ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇది ఇలా ఉండగా మరోపక్క టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పుడు సందీప్ వంగా డైరెక్షన్లో ధోని యాక్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

సెన్స్ షనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని యాక్ట్ చేశాడు. ఒకప్పుడు గ్రౌండ్లో పరుగులు తీసిన ధోని ఇప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు. మిస్టర్ కూల్ గా పిలవబడే క్రికెటర్ ధోని సందీప్ యాక్షన్ చెప్పగానే కెమెరా ముందు సూపర్ యాక్టింగ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోని నటించాడు. కాకపోతే థియేటరలో రిలీజ్ అయ్యే సినిమా కాదు ఒక కమర్షియల్ యాడ్ లో భాగంగా తీసిన ఈ వీడియో ఎలక్ట్రానిక్ సైకిల్ యాడ్ కోసం చేతులు కలిపారు. దీనికి సందీప్ వంగా డైరెక్షన్ చేయడం కాదు ధోని తో కలిసి నటించాడు. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ నటించిన సన్నివేశాలను ధోనితో రీ క్రియేట్ చేయించారు.
తాజాగా ఈ ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ms dhoni and sandeep reddy vanga update యానిమల్ మూవీలో రణబీర్ తన గ్యాంగ్ తో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ సిగరెట్ తాగుతూ వెళ్లే సీన్ అలానే రష్మిక మందన ఎంగేజ్మెంట్ అప్పుడు బైక్ మీద వెళ్లే సన్నివేశం హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ యాడ్ లో లాంగ్ హెయిర్ తో పూర్తిగా రనబీర్ లుక్కులోకి మారిపోయిన ధోని తన గ్యాంగ్ తో స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు ఆ వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి కట్ చెప్పి మైండ్ బ్లోయింగ్ మజా వచ్చింది. జనాలు ఇది చూసి విజిల్స్ చేస్తారని అంటూ క్లాప్స్ కొడతాడు.

నా హీరో రెడీ అంటూ సందీప్ రెడ్డి అంటాడు. అయితే బైక్ మీద కాకుండా ఒక సైకిల్ మీద వచ్చేలా సీన్ ప్లాన్ చేయడంపై ధోని ఏమీ అర్థం కానట్లు చూస్తూ ఉంటాడు దాని గురించి సందీప్ అడగబోతే క్లైమాక్స్ చాట్ కోసం రెడీగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధోని చివర్లో యానిమల్ లో హీరో మాదిరిగా ఓ సిగ్నేచర్ మూమెంట్ చేయడంతో ఈ యాడ్ ముగుస్తుంది. ప్రస్తుతం ధోని సందీప్ కలిసి చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.యానిమల్ మూవీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ వంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీయడానికి సిద్ధమయ్యారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందని చెప్పారు.

Read More >>

🔴Related Post