naga chaitanya and sobhita dhulipala news : హీరో నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రీసెంట్ గానే తన ప్రేయసి శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు తండేలు మూవీ తో భారీ హిట్ కొట్టింది. దీంతో నాగచైతన్య ఫుల్ హ్యాపీగా ఉన్నారు చైతన్య శోభిత గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లి తర్వాత తొలిసారి ఓ ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందని ఓపెన్ అయ్యారు శోభిత మొదటిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్ళినట్టు శోభిత తెలిపారు. తను ఎప్పుడు ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటానని చెప్పుకొచ్చారు ఆ తర్వాత మిమ్మల్ని చైతు ఫాలో అవుతున్నాడు కానీ మీరు ఎందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్ తనను అడిగారని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతు ప్రొఫైల్ కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని దాంతో తను కూడా చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.
ఇక 2022లో ఏప్రిల్ తర్వాత చైతన్యతో స్నేహం మొదలైందని శోభిత చెప్పుకొచ్చారు. అప్పటినుంచి మేము ఇద్దరం చాటింగ్ చేసుకునే వాళ్ళం అని చెప్పింది తెలుగులో మాట్లాడమని నాగ చైతన్య తనని తరచు అడిగేవాడు అంట అలా మాట్లాడటం వల్ల తమ బంధం మరింత బలపడిందని చెప్పారు. మొదటిసారి ముంబైలో ఓ కేఫ్ లో చైతన్యాన్ని కలిసినట్లు చెప్పారు. అప్పుడు చైతన్య హైదరాబాద్ తను ముంబైలో ఉన్నామని తనకోసం హైదరాబాదు నుంచి ముంబై వచ్చారని తెలిపింది. మొదటిసారి మేమిద్దరం బయటకు వెళ్ళినప్పుడు తను చైతన్య బ్లూ సూట్ లో వెళ్ళామని చెప్పింది.
naga chaitanya and sobhita dhulipala news ఇక నాగచైతన్య కుటుంబం తనను న్యూ ఇయర్ వేడుకలకు ఆహ్వానించినట్లు శోభిత చెప్పుకొచ్చారు. ఆ మరుసటి సంవత్సరం తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు చెప్పారు అలా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ చేశారని సీక్రెట్ రియల్ చేసింది శోభిత.