Naga Chaitanya : తెనాలి రామకృష్ణ కథతో రానున్న క్రేజీ హీరో

Written by 24 News Way

Updated on:

Naga Chaitanya : తెనాలి రామకృష్ణ కథతో రానున్న క్రేజీ హీరో.  శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో కవిగా పేరుగాంచిన తెనాలి రామకృష్ణుని అనేక కథలు ప్రజలు మనసులో ఉన్నాయి. ప్రస్తుతం తెనాలి రామకృష్ణ జీవితంపై ఒక సినిమా తీయాలని ప్రముఖ దర్శకుడు ఈ ప్రయత్నాన్ని చేపట్టారు. ఈ చిత్రంలో స్టార్ నటుడు తెనాలి రామకృష్ణ పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పౌరాణిక చారిత్రక చిత్రాలను తీసేవారు సాధారణంగా రాజులు ముఖ్యమైన దేవుళ్ళ కథ దృష్టి సారించి వారిని తెరపైకి తెస్తారు. తెనాలి రాముడు, బీర్బల్, ఇతర అద్భుతమైన వ్యక్తులు లేదా పాత్రల గురించి సినిమాలు తీయడం చాలా అరుదు ఇప్పుడు ఒక దర్శకుడు అలాంటి సాహసం చేసేందుకు రెడీ అయ్యారు.

అద్భుతమైన పాత్ర గుర్తింపు పొందిన విచిత్ర కవి తెనాలి రాముడు పాత్ర గురించి ఒక చిత్రం తెరపైకి రాబోతుంది. ఈ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణ కథలు తీసుకురావడానికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల విడుదలైన సూపర్ హిట్ చిత్రం తండెల్ చిత్రానికి దర్శకత్వం వహించిన చందూ మొండేటి  తెనాలి రామకృష్ణ కథ ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది.

ఈ మూవీలో హీరో నాగచైతన్య తెనాలి రామకృష్ణ పాత్రల్లో నటించిననున్నారట. మాస్, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న Naga Chaitanya ఇప్పుడు ఇలాంటి సాహసమైన పాత్రను పోషిస్తారని తెలుస్తుంది. ఇది అతనికి సవాల్ గా ఉండే పాత్ర అవుతుందని అనుకుంటున్నారు. ఈ మూవీ అతడికి మొదటి చారిత్రక చిత్రం అవుతుంది.

ఈ సినిమా గురించి చర్చలు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సినిమాలో నాగచైతన్య డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని వారు సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న తెనాలి రాముడు కథలు నీతికి మంచి ప్రాచుర్యం పొంది ఉన్నాయి.

తెనాలి రామకృష్ణ తన తెలివితేటలకు ఆశ చతురతకు ప్రసిద్ధి చెందినవాడు తెనాలి రామకృష్ణ గురించి అనేక కథలు ఇప్పటికే చాలా ఉన్నాయి. చందు మొన్నేటి ఇప్పుడు వాటి ఆధారంగా ఒక స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది ఈ సంవత్సరం ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు Naga Chaitanya  చందూ మొండేటి కలిసి ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. అందులో మొదటిది ప్రేమమ్, సవ్యసాచి, ఇటీవల విడుదలైన కొత్త మూవీ తండెల్ దీని తర్వాత తెనాలి రామకృష్ణ మూవీ చేయాలనుకుంటున్నారు హీరో నాగ చైతన్య దర్శకుడు చందు మండేటి వీళ్లిద్దరు కలిసి తీయనున్న మూవీ తెనాలి రామకృష్ణ అని పేర్కొన్నారు.

Read More>>

🔴Related Post