ఆ విషయంలో తండ్రిని మించిన నాగచైతన్య

Written by 24newsway.com

Published on:

ఆ విషయంలో తండ్రిని మించిన తనయుడుగా నాగచైతన్య పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. అక్కినేని నాగార్జున అంటే సినీ పరిశ్రమలో మన్మధుడుగా పేరు ఉంది. అమ్మాయిల కలల రాకుమారుడుగా ఇప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున గారు సినిమాలు దాటి బయటికి వస్తే ఆయనలో ఒక అద్భుతమైన వ్యాపారవేత్త కనిపిస్తాడు సినిమాల్లో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువగా నాగార్జున గారికి వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. నాగార్జున గారు ఒక సినిమా రెమన్యురేషన్ ఆయన కు సరదాగా వచ్చే ఆదాయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన హీరోగా నాగార్జున గారు అభివృద్ధి చెందాడు ప్రస్తుతం ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య కూడా తండ్రి బాటలోనే ఉన్నాడు.

వ్యాపారాలలో దూకుడు పెంచిన నాగచైతన్య

సాధారణంగా హీరోలు గాని హీరోయిన్లు గానీ తమ ఆదాయాన్ని ఇతర వ్యాపారాలలోకి మళ్లించి అదనపు ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు హీరోగా నిలదొక్కుకున్న నాగచైతన్య సినిమాకు ఎనిమిది కోట్ల నుంచి 10 కోట్ల పారి తోషికం తీసుకుంటున్నాడు ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో థండెల్ సినిమా చేస్తున్నాడు ఇటీవల తోటి నటి శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం కూడా చేసుకోవడం జరిగింది వచ్చే ఏడాది వీరి వివాహం జరగబోతుందని సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సమాచారం. నాగచైతన్య సినిమా హీరోగా రాణిస్తూనే వ్యాపార రంగంలో కూడా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు నాగచైతన్య తండ్రి నిర్వహించే వ్యాపారాలను చూసుకోవడమే కాకుండా తనకంటూ సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే

నాగచైతన్య బిజినెస్ ద్వారా ఏడాదికి సుమారు 12 కోట్ల ఆదాయం

హైదరాబాద్ మాదాపూర్ లో 2022లో షో యు పేరుతో క్లౌడ్ చికెన్ ను నాగచైతన్యగా రూ ప్రారంభించారు సౌత్ ఈస్ట్ ఆసియన్ వంటకాలను వివిధ ప్రసిద్ధి పలు రకాల ఆసియన్ వంటకాలను ఆహార ప్రియులకు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య గారు ఓపెన్ చేసిన షో యు లవ్ చికెన్ రెస్టారెంట్. దీనిలో రుచితో పాటు పర్యావరణ అనుకూలమైన ప్యాకేజింగ్ పై కూడా ఈ రెస్టారెంట్ దృష్టి పెట్టి అందరి ప్రశంసలు అందుకుంటుంది అది తక్కువ సమయంలోనే హైదరాబాదులో ఉన్న టాప్ 10 రెస్టారెంట్లలో ఒకటిగా నిలిచింది సినిమాల ద్వారా వచ్చే ఆదాయం కన్నా దీని మీద వచ్చే ఆదాయం చైతు కు ఎక్కువగా వస్తుంది ప్రతిరోజు ఈ రెస్టారెంట్ నుంచి రెండు లక్షల నుంచి మూడు లక్షల ఆదాయం వస్తుంది వారంతా వారం వీకెండ్ లో ఆదాయం డబల్ అవుతుందని తెలుస్తుంది ఏడాదికి ద్వారా నాగచైతన్య సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇక నాగచైతన్య మూవీస్ విషయానికి వస్తే చందు మొండేటి దర్శకత్వంలో తండెల్ మూవీ ఇప్పుడు షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో నాగచైతన్య గారి జోడిగా సాయి పల్లవి నటిస్తూ ఉంది వీళ్ళిద్దరిది హిట్ కాంబినేషన్ గా చెప్పవచ్చు. అలాగే ఈ మూవీని అల్లు అరవింద్ గారు నిర్మించడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు నాగచైతన్య గారు కమిట్ అయ్యారని తెలుస్తుంది. . నాగచైతన్య గారు హీరో నాగార్జున లాగా సినిమాలతో పాటు బిజినెస్ లో కూడా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే సినిమాలపరంగా బిజినెస్ పరంగా తండ్రికి తగ్గ కొడుకుగా నాగచైతన్య గారు నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

ప్రభాస్ మూవీ పై కొత్త అప్డేట్

ప్రభాస్ మూవీ పై కొత్త అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ గారు నటించబోయే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం సందీప్ రెడ్డి గారు ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది ఈ చిత్ర కథలో ప్రభాస్ పాత్ర వైల్డ్ ఎలిమెంట్తో బోల్డుగా సాగుతుందని పైగా ప్రభాస్ డ్యూయల్ట్రోల్లో కనిపించబోతున్నాడని ఒక టాక్.

ఈ సినిమాలో ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ మాఫియా డాన్ గా కానిపిస్తాడని ముఖ్యంగా ప్రభాస్ పాత్రలోని డెప్త్ కూడా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ గురించి ప్రేక్షకులు ఏదైతే బలంగా కోరుకుంటున్నారు అదే ఈ సినిమాలో ఉంటుందని సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ ఎప్పుడో చెప్పడం జరిగింది సుమారు ఈ సినిమా 400 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రవాసి గారు రాజా సాబ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ఇంకా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి .

ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి సిరీస్ తర్వాత సాహో సినిమా సౌత్ ఇండియాలో యావరేజ్ గా ఆడిన గాని నార్త్ ఇండియాలో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన రెండు మూవీస్ రాధా శ్యామ్ మరియు ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర గోరంగా విఫలం కావడం జరిగింది.. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన సలార్ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా సుమారు 800 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ వసూలు చేయడం జరిగింది.. ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ ఫామ్ లోకి రావడం జరిగింది. ఈ సినిమాను కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ గారు దర్శకత్వం వహించడం జరిగింది.

సలార్ సినిమా తర్వాత ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని 10 రెట్లు పెంచింది. ఈ సినిమాలో విజువల్స్ మరియు స్టోరీ చూసి మనము తెలుగు సినిమా చూస్తున్నామా లేకపోతే హాలీవుడ్ సినిమా చూస్తున్నావా అంతగా వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ని మెస్మరైజ్ చేసింది. కల్కి సినిమా ద్వారా ప్రభాస్ 1250 కోట్ల రూపాయలు వసూలు చేసి పాస్తా ఆఫీస్ తెర తన స్టామినాయేంటో మరోసారి నిరూపించుకోవడం జరిగింది.

సందీప్ రెడ్డి వంగా విషయానికొస్తే తాను రీసెంట్గా తీసిన అనిమల్ సినిమా సుమారు 800 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి ఇండియా సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచింది. ఇంతటి విజయాలు సాధించిన హీరో మరియు డైరెక్టర్ కలిసి చేస్తున్న సినిమా ఏ రేంజ్ లో ఉంటదనేది మనము ఊహించుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆ ఆల్ అవర్ వరల్డ్ ఫ్యాన్స్ ఎదురుచూడడం జరుగుతుంది.

Read More>>

Leave a Comment